తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సుదీర్ఘ కసరత్తు అనంతరం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.మొత్తం 52 మందితో బీజేపీ ఫస్ట్ లిస్టును ప్రకటించింది.
జాబితాలో ఎనిమిది మంది ఎస్సీ, ఆరుగురు ఎస్టీలకు స్థానం కల్పించిన బీజేపీ 12 మంది మహిళలకు చోటు కల్పించింది.లిస్టులో భాగంగా సిర్పూర్ నియోజకవర్గం నుంచి పాల్వాయి హరీశ్ బాబు, బెల్లంపల్లి (ఎస్సీ) నుంచి అమరాజుల శ్రీదేవి, నిర్మల్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ – రామారావు పటేల్, ఆర్మూర్ – పైడి రాకేశ్ రెడ్డి, జుక్కల్ – టి.అరుణతార, కామారెడ్డి – వెంకట రమణారెడ్డి, బోథ్ – సోయం బాపురావు, ఆదిలాబాద్ – పాయల్ శంకర్, ఖానాపూర్ – రమేశ్ రాథోడ్, హుజూరాబాద్ – ఈటల రాజేందర్, నర్సాపూర్ – మురళీయాదవ్, పటాన్ చెరు – నందీశ్వర్ గౌడ్, దుబ్బాక – రఘునందన్ రావు, గజ్వేల్ – ఈటల రాజేందర్, కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్, ఇబ్రహీంపట్నం -నోముల దయానంద్ గౌడ్, మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్, ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి, కార్వాన్ -అమర్ సింగ్, నిజామాబాద్ అర్బన్ – సూర్య నారాయణ గుప్తా, బాల్కొండ -అన్నపూర్ణమ్మ, కోరుట్ల – ధర్మపురి అరవింద్, జగిత్యాల – భోగ శ్రావణి, ధర్మపురి – ఎస్ కుమార్, రామగుండం – కందుల సంధ్యారాణి, కరీంనగర్ – బండి సంజయ్, చొప్పదండి – బొడిగె శోభ, సిరిసిల్ల – రాణి రుద్రమ, మానకొండూర్ – ఆరేపల్లి మోహన్ లను అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది.