తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభించి అనంతరం నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అయినటువంటి వారిలో దిల్ రాజు ఒకరు.చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి లాభాలను అందుకున్నటువంటి దిల్ రాజు నేడు ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా వృత్తిపరమైన జీవితంలో సక్సెస్ అయినటువంటి ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇక ఈయన అనిత అనే మహిళని వివాహం చేసుకుని బిడ్డకు జన్మనిచ్చారు.ఆ బిడ్డకు కూడా వివాహం చేసి ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో తన భార్య అనిత గుండెపోటుతో మరణించారు.ఇలా అనిత మరణించడంతో మూడు సంవత్సరాల పాటు ఒంటరిగా ఎంతో బాధను అనుభవించిన దిల్ రాజు అనంతరం తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు.ఇలా నాలుగు పదుల వయసులో దిల్ రాజు రెండో వివాహం చేసుకొని ఓ బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం.
ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన కేవలం తన సినిమాల గురించి మాత్రమే ప్రస్తావించే దిల్ రాజు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తేజస్వినినీ రెండో వివాహం చేసుకోవడానికి గల కారణం ఏంటి అసలు తనతో పరిచయం ఎలా ఏర్పడిందనే విషయాల గురించి చెప్పుకొచ్చారు.తన భార్య అనిత మరణించిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డానని అయితే తన జీవితంలో మళ్లీ ముందుకు వెళ్లాలంటే కొన్ని ఆప్షన్లు ఉన్నాయి కానీ నా బిజీ షెడ్యూల్ ను అర్థం చేసుకునేవారు కావాలనుకున్నాను.అదే సమయంలో ఒకరోజు విమానంలో ప్రయాణిస్తుండగా తనకు తేజశ్విని పరిచయమయ్యారని, తన నెంబర్ తీసుకొని తనని అర్థం చేసుకోవడానికి దాదాపు సంవత్సరం సమయం పట్టిందని అనంతరం తనకి ప్రపోజ్ చేయడం,ఆ తర్వాత కుటుంబ సభ్యులతో చెప్పి మా వివాహానికి ఒప్పించిన అనంతరం మా పెళ్లి జరిగిందని ఈ సందర్భంగా దిల్ రాజు తన రెండో పెళ్లి వెనుక ఉన్న స్టోరీ మొత్తం చెప్పారు.
ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.