బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రెఢీ ! ప్రకటన ఎప్పుడంటే ..? 

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావాహులకు బీఆర్ఎస్ ( BRS party )అధిష్టానం త్వరలోనే శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది.సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు సమయం మాత్రమే ఉండడంతో , పూర్తిగా అభ్యర్థుల ఎంపికపైనే ఇప్పటివరకు బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించారు.

 The List Of Brs Candidates Is Complete When Is The Announcement, Brs, Telangana-TeluguStop.com

అనేక సర్వేలు నిర్వహించి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేశారు.అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉండడంతో , సెప్టెంబర్ లోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.

అందుకే ముందుగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుని ప్రకటించేందుకు ప్లాన్ చేసుకుంది.

Telugu Brs Mla Tickets, Telangana Cm, Telangana-Politics

 ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు సమయం ఉంటుందని భావిస్తున్నారు.ఈ మేరకు అభ్యర్థుల జాబితా పై కెసిఆర్( CM Kcr ) ఒక అంచనాకు వచ్చారట.ఈ మేరకు తుది జాబితాను సిద్ధం చేసుకున్నారట .ఈనెల 17 నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది.18న శ్రావణ మొదటి శుక్రవారం కావడంతో అదే రోజున అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనే ఆలోచనతో కెసిఆర్ ఉన్నారట.మొదటి విడత జాబితాలో 135 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఒకవేళ 105 మంది పేర్లను ప్రకటించకపోతే , కెసిఆర్ లక్కీ నెంబర్ అయిన ఆరు సంఖ్య వచ్చే విధంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు .

Telugu Brs Mla Tickets, Telangana Cm, Telangana-Politics

 ప్రస్తుత బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉందని సర్వేల్లో తేలడం, దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనే నివేదికలు అందడంతో 40 మందిలో 20 మందిని మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట.మిగతా చోట్ల సిట్టింగ్ లకే ఎక్కువ ఛాన్స్ ఉండబోతున్నట్లు సమాచారం.అదీ కాకుండా,  ఇటీవల కాంగ్రెస్, టిడిపి( TDP ) బిజెపి నుంచి వచ్చి చేరిన వారిలోనూ కొంతమందికి టికెట్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube