విమానయాన సంస్థ కీలక నిర్ణయం.. లగేజీతో పాటు అవి తీసుకెళ్లకుండా నిషేధం!

విమాన ప్రయాణాలు చేసేటప్పుడు అందరూ సహజంగా ఎదుర్కొనే సమస్య తమ లగేజీని తీసుకెళ్లడం.అవును, ఇక్కడ కొత్తగా విమానంలో ప్రయాణించేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

 The Key Decision Of The Airline , Airport, Viral Latest, News Viral, Latest New-TeluguStop.com

ఎలాంటి లగేజీని తీసుకెళ్ళలో, ఎలాంటి లగేజీని తీసుకెళ్లకూడదో ఒక క్లారిటీ ఉండాలి.లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇకపోతే తాజాగా జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.విమాన ప్రయాణికులు లగేజీలో యాపిల్ ఎయిర్‌ట్యాగ్స్ తీసుకురావడాన్ని నిషేధించింది.

బేసిగ్గా ప్రయాణికులు తమ లగేజీని ట్రాక్ చేయడానికి ఎయిర్‌ట్యాగ్స్‌ను వాడుతూ వుంటారు.ప్రయాణికుల లగేజీని విమాన సిబ్బంది ఒకవేళ ఒక చోటుకి బదులు మరోచోటుకి పంపినా ఎయిర్‌ట్యాగ్స్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు.

అందువలనే వీటిని ఎక్కువగా వాడుతూ వుంటారు.అయితే ఇపుడు అలాంటివారికి ఇది చేదు వార్తనే చెప్పుకోవాలి.

ఈ పరికరం ఉపయోగకరమైనదే అయినప్పటికీ. ICAO (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) మార్గదర్శకాలకు అనుగుణంగా ఎయిర్‌ట్యాగ్స్‌ని నిషేధించామని లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.

Telugu Airport, Key, Latest, Lufthansa, Luggage-Latest News - Telugu

తాజాగా వారు ఈ విషయమై స్పందిస్తూ, లగేజీలో యాక్టివేటెడ్ ఎయిర్‌ట్యాగ్స్ నిషేధిస్తున్నామని, విమానప్రయాణాలకు ఎయిర్‌ట్యాగ్స్ ప్రమాదకరమైనవని, వాటిని ఆఫ్ చేయాల్సి ఉంటుందని ట్వీట్‌లో పేర్కొంది.లుఫ్తాన్సా గైడ్‌లైన్స్ ప్రకారం నిషేధం విధించలేదని పలు రిపోర్టులు పేర్కొన్నప్పటికీ ఇది నిజమని తెలుస్తోంది.ఇక ICAO నిబంధనల ప్రకారం.లిథియం-ఐయాన్ బ్యాటరీలు ఉన్న 15-ఇంచ్ యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో అంటే సెప్టెంబర్ 2015 నుంచి ఫిబ్రవరి 2017 మధ్య కొనుగోలు చేసిన పరికరాలను మాత్రమే నిషేధించాలని రిపోర్టులు తెలపడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube