2012 డిసెంబర్ 16 న చోటుచేసుకున్న దారుణ ఘటన నిర్భయ ఘటన.ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా చలించివేసింది.
అలాంటి అత్యంత దారుణంగా నిర్భయ దోషులు అర్ధరాత్రి పూట తన ఫ్రెండ్ తో వెళుతున్న యువతి పై అత్యంత పాశవికంగా దాడి చేసి మరీ ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేసి, నరకం చూపించి మరీ నడిరోడ్డు పై నగ్నంగా ఆ యువతిని బస్సులో నుంచి విసిరివేశారు.అత్యంత పాశవికంగా ప్రవర్తించిన ఆ దుర్మార్గులకు ఎట్టకేలకు 8 ఏళ్ల కు ఉరిశిక్షలు అమలు అవ్వడం తో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం నిర్భయ ఘటనకు సంబంధించి ఆ నలుగురు నిందితులకు బాగానే ఉరిశిక్షలు అమలు అయ్యాయి.అసలు ఈ ఘటనలో పాల్గొన్నది ఆరుగురు కాగా, ఒకరు గతంలోనే జైలు లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
అయితే మరొకరు మాత్రం మైనర్ కావడం తో కొద్దీ కాలమే జైలు శిక్షను అనుభవించి ఆ తరువాత విడుదల అయ్యాడు.అయితే నిర్భయ దోషుల ఉరి అమలు తరువాత ఇప్పుడు జైలు నుంచి రిలీజైన ఆ మైనర్ నిందితుడు ఎక్కడ ఉన్నాడో విషయం తెలిసింది.
ఆ నిందితుడు దక్షిణ భారత దేశంలో .ఎవరూ గుర్తుపట్టని ప్రాంతంలో పనిచేస్తున్నట్లు అధికారులు చెప్పారు.నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషులుగా ఉన్న నలుగుర్ని ఇవాళ ఉరి తీశారు.మొత్తం ఆరుగురు నిందితుల్లో రామ్ సింగ్ అనే అతను జైలులో ఉరి వేసుకుని చనిపోయాడు.
ఇక ఆ కేసులో నిందితుడిగా ఉన్న మైనర్ ప్రస్తుతం రిలీజై రహస్య జీవితాన్ని గడుపుతున్నాడు.ఢిల్లీకి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన ఆ మైనర్ .గ్యాంగ్ రేప్ జరిగిన రోజున అక్కడే ఉన్నాడు.అతను కూడా క్రూరంగా రేప్‌కు పాల్పడినట్లు తెలిసింది.
బస్సు ఓనర్ అయిన రామ్ సింగ్.ఆ మైనర్‌కు క్లీనర్‌గా ఉద్యోగం ఇప్పించాడు.11 ఏళ్లకే ఇళ్లు వదిలి వచ్చిన ఆ మైనర్‌ను రామ్ సింగ్ చేరదీశాడు.రేప్ కేసులో దోషిగా తేలిన మైనర్‌ను కొన్నాళ్లు జైలులో ఉంచారు.
ఆ తర్వాత అతన్ని రిలీజ్ చేశారు.
అయితే ఢిల్లీకి దూరంగా అతన్ని పంపినట్లు పోలీసులు చెబుతున్నారు.అతని ఆనవాళ్లు ఎవరికీ తెలియదు.ఎప్పుడూ అతని ముఖాన్ని కప్పివేయడం వల్ల ఆ మైనర్‌ను ఎవరూ గుర్తుపట్టలేరు.
జైలులో ఉన్నప్పుడు ఆ మైనర్ వంట నేర్చుకున్నాడు.అయితే జైలు నుంచి రిలీజ్ అయిన తరువాత ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతను ఓ వంటవాడిగా జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిస్తుంది.
ఇప్పటికి కూడా అతనిపై పోలీసులు ఎప్పుడూ నిఘా పెట్టి ఉన్నట్లు సమాచారం.