ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజుకు చేరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పార్లమెంట్ ను మణిపూర్ అంశం కుదిపేసింది.
ఉభయ సభల్లోనూ మణిపూర్ హింసాత్మక ఘటనపై చర్చ జరపాలంటూ విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి.ఈ నేపథ్యంలో స్పీకర్ పోడియంను చుట్టు ముట్టిన విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ నిరసనకు దిగారు.
దీంతో పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి.కాగా రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్ కు గురయ్యారు.
రాజ్యసభ ఛైర్మన్ వేదిక వద్దకు వెళ్లి సంజయ్ సింగ్ ఆందోళన చేశారు.దీంతో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు సంజయ్ సింగ్ ను రాజ్యసభ ఛైర్మన్ సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.