Rocky Aur Rani Kii Prem Kahaani: అలియా మూవీపై మండిపడిన సెన్సార్ బోర్డు.. ఆ పదాలు తొలగించాలని ఆదేశాలు జారీ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, హీరో ఆలియా భట్, రణ్‌వీర్‌ సింగ్ కలిసి నటించిన తాజా చిత్రం రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ.( Rocky Aur Rani Kii Prem Kahaani ) ఇందులో రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీలు కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.

 Cbfc Replaces Objectional Words Rocky Aur Rani Kii Prem Kahaani-TeluguStop.com

ఈ చిత్రానికి కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని వయకామ్18 స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు.

కాగా ఇటీవలే షూటింగ్‌ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల అనగా జులై 28న విడుదల కానుంది.ప్రస్తుతం చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

రణ్‌వీర్‌ సింగ్,( Ranveer Singh ) అలియా భట్( Alia Bhatt ) ప్రస్తుతం ముంబైలో బిజీ బిజీగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీపై సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌( CBFC ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు మండిపడింది.

అందుకు గల కారణం ఈ సినిమాలో కొన్ని పదాలు, డైలాగ్స్‌.వాటిని వెంటనే సినిమా నుంచి తీసేయాలి తొలగించాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది సెన్సార్ బోర్డు.

ఇంతకీ ఆ పదాలు ఏంటి అసలేం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.ఈ సినిమాలో ఉపయోగించిన కస్ పదాన్ని మార్చాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మూవీ మేకర్స్‌ను ఆదేశించింది.

Telugu Abusive, Aliya Bhatt, Cbfc, Dharmendra, Karan Johar, Lok Sabha, Mamata Ba

అంతే కాకుండా లోక్‌సభ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై ( CM Mamata Banerjee ) డైలాగ్స్‌ తొలగించాలని సూచించింది.దీంతో కొన్ని అభ్యంతరకర పదాలు, డైలాగ్స్ తొలగించడానికి చిత్రబృందం అంగీకరించగా సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి అనుమతి ఇచ్చింది.ఈ సినిమాలో చాలాసార్లు ఎక్కువగా వినియోగించిన బ్రా, ఓల్డ్‌ మాంక్ అనే పదాలను మారుస్తామని చెప్పడంతో సెన్సార్ బోర్డ్‌ అనుమతించింది.

Telugu Abusive, Aliya Bhatt, Cbfc, Dharmendra, Karan Johar, Lok Sabha, Mamata Ba

లోక్ సభ డైలాగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించిన డైలాగ్స్‌ను పూర్తిగా తొలగించాలని మేకర్స్‌ను కోరింది.రవీంద్రనాథ్ ఠాగూర్ సన్నివేశంలో అభ్యంతకర పదాన్ని తొలగించాలని ఆదేశించింది.మహిళల లోదుస్తుల షాప్ సన్ని వేశాల్లో బ్రా అనే పదం వినియోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇలాంటి పదాలు వాడితే స్త్రీలను కించపరచడమేనని చిత్ర బృందం పై సెన్సార్ బోర్డ్ మండిపడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube