లేటెస్ట్ సర్వే లో దారుణంగా పడిపోయిన టీడీపీ గ్రాఫ్..'యువగళం' ఇక లేనట్టేనా?

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది.రాజు లేకపోతే రాజ్యం అస్తవ్యస్తం అవుతుంది అంటే ఇదేనేమో.

చంద్రబాబు నాయుడు జైలు లోకి వెళ్లినప్పటి నుండి పార్టీ స్తబ్దు గా మారిపోయింది.వాస్తవానికి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పార్టీ క్యాడర్ లో ఈ యాత్ర ఇచ్చిన జోష్ మామూలుది కాదు.చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Naidu arrest ) అయ్యినప్పటి నుండి ఈ యాత్ర ఆగిపోయింది.

మళ్ళీ ఎప్పటి నుండి మొదలు అవ్వుద్దో ఎవ్వరూ చెప్పలేకున్నారు.నారా లోకేష్( Nara lokesh ) యాత్ర సంగతి కాసేపు పక్కన పెడితే ఆయన తల్లి భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి పర్యటించబోతుంది.

Advertisement

ఇది పార్టీ కి ఎంత మేరకు సహాయం చేస్తుందో చెప్పలేమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సర్వేలు తెలుగు దేశం పార్టీ లో గుబులు పుట్టిస్తుంది.

ఆ సర్వే లెక్కల పరంగా తెలుగు దేశం పార్టీ లో ఇంతకు ముందు ఉన్న జోష్ ఇప్పుడు లేదు అని అంటున్నాయి.గతం లో చేసిన సర్వే ప్రకారం తెలుగు దేశం పార్టీ సోలో గా ఎన్నికలలో పోటీ చేస్తే 80 కి పైగా స్థానాలు వస్తాయని సర్వేలు చెప్పాయి.కానీ లేటెస్ట్ సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఆ పార్టీ కి ఈసారి 65 సీట్స్ మించి వచ్చేలా కనిపిస్తలేదట.

జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కచ్చితంగా అధికారం లోకి అయితే వస్తారు కానీ, మెజారిటీ ఆశించిన స్థాయిలో ఉండదని అంటున్నారు.అందుకు కారణం పార్టీ కార్య కలాపాలు అన్నీ ఆగిపోవడం వల్లే.

మొక్కుబడిగా చేస్తున్న కొన్ని నిరసన కార్యక్రమాలు ఫలితాల్ని ఇవ్వడం పక్కన పెడితే తెలుగు దేశం పార్టీ ని నవ్వులపాలు చేస్తుంది.మొన్న నిర్వహించిన న్యాయానికి సంకెళ్లు ప్రోగ్రాం సోషల్ మీడియా లో పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇప్పుడు తెలుగు దేశం పార్టీ భవిష్యత్తు మొత్తం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేతిలోనే ఉంది.ఆయన ఎన్నికల ప్రచారం, ఇచ్చే ప్రసంగాలు, వారాహి విజయ యాత్ర ఇవన్నీ కూటమి లో జోష్ ని తీసుకొని రావాలి.పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

ఈ యాత్ర తాలూకు ఏకైక మైనస్ ఏమిటంటే, రెగ్యులర్ గా వుండకపోవడమే.వారం రోజులు యాత్ర ని నిర్వహిస్తే, మిగిలిన రోజులు మొత్తం ఖాళీగా ఉంచాల్సి వస్తుంది.

అదే ఈ యాత్ర పూర్తి స్థాయిలో గ్యాప్ లేకుండా నిర్వహిస్తే టీడీపీ - జనసేన కూటమిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని సర్వేలు చెప్తున్నాయి.మరి రానున్న రోజుల్లో అధికారం వైపు ఈ రెండు పార్టీలు కలిసి ఎలా ముందు అడుగులు వెయ్యబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు