స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘లియో‘.( LEO ).ముందు నుండి భారీ అంచనాలు పెంచేసుకున్న ఈ సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
రిలీజ్ ముందే భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ రిలీజ్ తర్వాత కూడా సేమ్ రెస్పాన్స్ వస్తుంది.గతంలో విజయ్ సినిమాలకు సైతం లేనంత హైప్ ముందుగానే క్రియేట్ అయ్యింది.
తమిళ్ లోనే కాదు వరల్డ్ వైడ్ గా ప్రీ సేల్స్ తో అదర గొట్టింది.ఇక యుఎస్ లో ముందు నుండి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రీ సేల్స్ జరుపుకుందో చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూడగా ఈ సినిమా రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు.ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ లో సెన్సేషనల్ ప్రీమియర్స్ నమోదు అయ్యాయి.దీంతో ఈ మూవీ యూఎస్ లో రికార్డ్ మైల్ స్టోన్ అందుకుందని తెలుస్తుంది.ఈ సినిమా ఆర్ఆర్ఆర్( RRR ) రిలీజ్ తర్వాత ఏ సినిమా అందుకోని ఫాస్టెస్ట్ 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ అందుకుంది…
ఈ విషయాన్నీ డిస్టిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేస్తూ ప్రీమియర్స్ సహా డే 1 కి కలిపి 2.1 మిలియన్ డాలర్స్ మార్క్ ను అందుకున్నట్టు తెలుస్తుంది.కాగా ‘లియో’ సినిమాలో విజయ్ కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష( Trisha ) నటిస్తుంది.
సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.