మామూలుగా పోలీస్ స్టేషన్ లో పోలీసులు నేరస్తులు ఉంటారు.కానీ ఒక పోలీస్ స్టేషన్‌లో కింగ్ కోబ్రా వచ్చి హల్ చల్ చేసింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లోని పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.
ఓ నాగుపాము పోలీస్ స్టేషన్‌లో కనిపించడంతో పోలీసు అధికారులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
అదెక్కడ కాటేస్తుందోనని అంతా ఆందోళన చెందారు.
స్టేషన్‌కు వచ్చిన ప్రజలు కూడా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.అయితే ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు.
అనంతరం స్నేక్ క్యాచర్ దానిని పట్టుకుని బంధించాడు.అయితే వీడియోలో స్నేక్ క్యాచర్ నాగుపామును శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది బుసలు కొట్టింది.
దానిని శాంతింపజేయడానికి బదులు రెచ్చగొట్టేలా కనిపించింది.ఈ సమయంలో పలువురు పోలీసు అధికారులు కూడా సమీపంలోనే నిలబడి ఉన్నారు.
పోలీస్ స్టేషన్‌లో అకస్మాత్తుగా కింగ్ కోబ్రా కనిపించడంతో అందరూ పరుగులు తీసినట్లు అధికారులు తెలిపారు.అనంతరం స్నేక్ క్యాచర్ దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్టు వెల్లడించారు.
ఈ పాము కొన్ని నిమిషాలపాటు పడగవిప్పి బుసలు కొడుతూనే ఉందని పేర్కొన్నారు.పోలీస్ స్టేషన్ యమునా నది ఒడ్డున ఉండటం వల్లే ఈ కింగ్ కోబ్రా కుతౌండ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిందని తెలిపారు.
నది ఒడ్డు నుంచి ప్రతిరోజూ పాములు స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి వస్తుంటాయని పోలీస్ స్టేషన్ చీఫ్ అఖిలేష్ ద్వివేది తెలిపారు.ఇంతకు ముందు కూడా పాములు వచ్చాయని కానీ, ఈ పాము మాత్రం మరింత భయాందోళనకు గురిచేసిందని తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీనిని చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.పాము పోలీసుల మీద పగ పట్టిందా అని కూడా మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.