Mehmet Ergun : సూర్యుడిపై అతిపెద్ద పేలుడును అద్భుతంగా ఫొటో తీసిన ఆస్ట్రోఫోటోగ్రఫర్‌.. ఫొటో వైరల్..

నక్షత్రాలు, గ్రహాల చిత్రాలను తీసే కళను ఆస్ట్రోఫోటోగ్రఫీ ( Astrophotography )అంటారు.ఈ పిక్స్ తీయడం అంత సులభం కాదు.

 The Astrophotographers Photo Of The Biggest Explosion On The Sun Has Gone Viral-TeluguStop.com

దీనికి చాలా సమయం, నైపుణ్యం, జ్ఞానం అవసరమవుతుంది.ప్రతి సంవత్సరం రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్విచ్( Royal Observatory Greenwich ) (ROG) బెస్ట్ ఆస్ట్రోఫోటోగ్రఫీ ఫోటోల కోసం పోటీని నిర్వహిస్తుంది.

చాలా మంది నిపుణులు ఈ పోటీలో పాల్గొంటారు.అయితే ఈ ఏడాది ఈ పోటీలో టర్కీకి చెందిన మెహ్మెట్ ఎర్గున్ ( Mehmet Ergun )అనే వ్యక్తి పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకున్నాడు.

అతను “గ్రేట్ సోలార్ ఫ్లేర్‌”ను చాలా అందంగా ఫొటో తీశాడు.

సూర్యునిపై పెద్ద పేలుడును గ్రేట్ సోలార్ ఫ్లేర్‌ అంటారు.

మెహ్మెట్ ఈ చిత్రాన్ని తీయడానికి ఒక స్పెషల్ టెలిస్కోప్‌ను ఉపయోగించాడు.ఫొటో సూర్యుడిని చాలా దగ్గరగా చూపిస్తుంది.

పేలుడు భూమి కంటే పెద్దది.అతను 2022, సెప్టెంబర్ 4న జర్మనీలో చిత్రాన్ని తీశాడు.

సూర్యుడిపై స్థలం ఎంత అద్భుతంగా ఉందో అతని ఫోటోలో మనం చూడవచ్చు.

మెహ్మెత్ ఎర్గున్ ఇంతకు ముందు అనేక ఇతర అవార్డులను గెలుచుకున్నారు.NASA నుంచి మూడు, AAPOD2 నుంచి ఒకటి, ఆస్ట్రాబిన్ నుంచి ఒకటి, సేవ్ ఎ స్టార్ నుంచి ఒకటి, ఈపోడ్ నుంచి ఒకటి, ఆస్ట్రోనోమియా నుంచి ఒకటి ఇలా చాలా అవార్డులను సాధించాడు.పీపుల్స్ ఛాయిస్ కేటగిరీలో తన చిత్రాన్ని ఉత్తమమైనదనిగా ప్రకటిస్తున్నట్లు ROG న్యాయ నిర్ణేతలు తెలిపారు.

సెకండ్ బెస్ట్ అవార్డును కార్ల్ ఎవాన్స్ తీసిన ఎ రాకీ రైజ్, థర్డ్ బెస్ట్ విన్సెంట్ బ్యూడెజ్ ( A Rocky Rise, Third Best Vincent Beaudez )తీసిన బటర్‌ఫ్లై అని తెలిపారు.

హెచ్-ఆల్ఫా సోలార్ టెలిస్కోప్‌తో ఈ చిత్రాన్ని తీశానని మెహ్మెట్ ఎర్గున్ తెలిపాడు.ఇది సూర్యుడిని బాగా చూడగలిగే టెలిస్కోప్.తాను చిత్రాన్ని తీసేటప్పుడు సూర్యడు చాలా యాక్టివ్‌గా ఉన్నాడని, పేలుడు చాలా పెద్దదని, పొడవుగా ఉందని చెప్పాడు.

మెహ్మెట్ ఎర్గున్ తన విజయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పంచుకున్నాడు.తనకు ఓటు వేసి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.ఈ అవార్డు గెలవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నాడు.పదేళ్ల క్రితం ఇలాంటి గొప్ప అవార్డు దక్కుతుందని అస్సలు ఊహించలేదని అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube