చైనా దురహంకార చర్యలను నివారించడానికి భారత్ క్వాడ్ లో చేరిందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పంపియో తెలిపారు.స్వాతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబించే భారత్ చైనా దుందుడుకు చర్య కారణంగా తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందని తన తాజా పుస్తకం నెవర్ గివ్ యాన్ ఇంచ్ ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్ లో పంపీయో వెల్లడించారు.2020 జూన్ లో తూర్పు లబ్దఖ్లోని గాల్వాన్ లోయలో భారత్ చైనా మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తిన విషయం భారతీయులకు తెలిసిందే.ఈ ఘటనలో ఇరుపక్షాల వైపు పలువురు సైనికులు మృతి చెందారు.
ఈ ఉదాంతం తర్వాత ఉభయాదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.తన పుస్తకంలో భారత్ ను సామ్యవాద పునాదులపై ఏర్పడిన దేశంగా పాంపియో అన్నారు.
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఇటు అమెరికా, అటు రష్యా ఏ కూటమిలోనూ చేరకుండా భారత్ స్వతంత్ర వైఖరిని అవలంబించిందని వెల్లడించారు.ఇప్పటికీ దాదాపు అదే విధానాన్ని అనుసరిస్తుందని తెలియజేశారు.
2024లో పంపీయో అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉందని అమెరికాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆగడాలను నిలువరించడమే లక్ష్యంగా 2017 అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా ఈ కూటమిలో సభ్య దేశాలు భారతను ఈ కూటమిలోకి తీసుకురావడంలో ట్రంప్ నేతృత్వంలో అమెరికా ప్రభుత్వం విజయం సాధించిందని పంపీయో వెల్లడించారు.గల్వాన్ ఘర్షణ తర్వాత చైనాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు భారత్లో జరుగుతున్నాయని తన పుస్తకంలో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో టిక్ టాక్ తో పాటు చైనా యాప్ లను భారత్ నిషేధించినట్లు వెల్లడించారు.
భారత్ చైనా ల మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటా అన్న ప్రశ్నకు తనకు తరచూ ఎదురయ్యేది పంపియో ఆ పుస్తకంలో రాసుకొచ్చారు.అమెరికా, భారతదేశం మధ్య గతంలో ఎన్నడు లేనంత దగ్గర సంబంధాలను ఏర్పరచడానికి తమ అవకాశాలను సృష్టించుకుంటున్నాం అనే అని ఆ ప్రశ్న వేసిన వాళ్లకు సమాధానం ఇచ్చే వాళ్ళం అని పంపియో తెలియజేశారు.