ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుకు నిర్వహిస్తున్న అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఆయన అంత్యక్రియలకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ తో పాటు అటవీ శాఖ సిబ్బంది భారీగా హాజరైయ్యారు.
ఈ క్రమంలో దాడుల నుంచి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఫారెస్ట్ సిబ్బంది నినాదాలు చేశారు.అనంతరం మంత్రుల వద్దకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు అటవీశాఖ సిబ్బందిని అడ్డుకున్నారు.అయితే నినాదాల నేపథ్యంలో మంత్రులు వెళ్లిపోయారని తెలుస్తోంది.
ఈ క్రమంలో రేపటి నుంచి విధులకు హాజరుకాబోమంటూ ఫారెస్ట్ సిబ్బంది ప్రకటించారు.తమకు ప్రాణభయం ఉందని, ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.