ప్రముఖ టాలీవుడ్ నటి కవిత ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కెరీర్ పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించి చాలా విషయాలను చెప్పుకొచ్చారు.
నా భర్త మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఒకటేనని ఆమె పేర్కొన్నారు.నమ్మి మోసపోయామని అది తలచుకుంటే బాధ అనిపిస్తుందని కవిత వెల్లడించారు.
డబ్బు అప్పు అడిగితే ఎవరికైనా ఇవ్వొచ్చని కానీ పిల్లల నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చి అక్షింతలు వేయించుకున్నామని కవిత అన్నారు.కోర్టులో జడ్జి కూడా మమ్మల్ని చూసి నవ్వారని కవిత పేర్కొన్నారు.
ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే మా పిల్లలు కూడా సహాయాలు చేయాలని భావిస్తారని ఆమె వెల్లడించారు.నేను చాలా సినిమాల్లో స్విమ్ సూట్స్ వేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
తొలిసారి స్విమ్ సూట్ వేసుకున్న సమయంలో అన్ కంఫర్టబుల్ గా ఉన్నానని కవిత అన్నారు.నేను చాలా మోడ్రన్ డ్రెస్ లు వేసుకున్నానని ఆమె తెలిపారు.గ్లామర్ గా ఉండే డ్రెస్ లకు నేను ప్రాధాన్యత ఇచ్చానని కవిత పేర్కొన్నారు.నేను, శ్రీదేవి ఎక్కువగా మోడ్రన్ ఔట్ ఫిట్స్ వేసుకున్నామని ఆమె వెల్లడించారు.జయసుధ, జయప్రద మోడ్రెస్ డ్రెస్ లు తక్కువగా వేసుకున్నారని కవిత వెల్లడించారు.
మోహన్ బాబు గారితో నేను 9 సినిమాలు చేశానని ఆమె పేర్కొన్నారు.ఆ సమయానికి మేము ఎలా ఉండాలో అలా ఉన్నామని కవిత చెప్పుకొచ్చారు.కుటుంబ సభ్యులను నేను కోల్పోయానని వాటి గురించి ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
కుటుంబంలో ఐదుగురు ఉన్నవాళ్లం ముగ్గురం అయ్యామని ఏడుస్తూ కవిత చెప్పుకొచ్చారు.ప్రముఖ నటి కవిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.