కొన్నేళ్ల క్రితం వరకు మంచు విష్ణు నటించిన సినిమాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో బిజినెస్ జరిగేది.మంచు విష్ణు నటించిన ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, ఈడోరకం ఆడోరకం సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.
అయితే ఈ మధ్య కాలంలో మంచు విష్ణుపై వస్తున్న ట్రోల్స్ ఆయన సినీ కెరీర్ పై ప్రభావం చూపుతున్నాయి.మంచు విష్ణు సినిమాలకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు రావడం కూడా కష్టమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే మంచు విష్ణు కంటే సుడిగాలి సుధీర్ కు క్రేజ్ ఎక్కువని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.గాలోడు సినిమా బీ, సీ సెంటర్లలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుండగా ఈ సినిమాకు రెండు రోజుల్లో ఏకంగా కోటీ 20 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమాకు 2.70 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఆదివారం రోజు కూడా ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయి.
ఫస్ట్ వీక్ లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సినీ వర్గాల్లో వినిపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.జిన్నా సినిమా ఫుల్ రన్ లో కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటే గాలోడు సినిమా మాత్రం ఫస్ట్ వీకెండ్ లోనే దాదాపు 2 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.గాలోడు సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మంచు విష్ణుపై ట్రోల్స్ వస్తున్నాయి.
కొన్నిసార్లు ట్రోల్స్ గురించి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్న మంచు విష్ణు మరికొన్ని సందర్భాల్లో మాత్రం ట్రోల్స్ విషయంలో సీరియస్ అవుతున్నారు.మంచు విష్ణు మళ్లీ వరుస విజయాలను సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.