దసరా నవరాత్రులలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్, హేమచంద్రాపురం నందు గల దుర్గా మాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు.ఈ ఆయుధ పూజా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.
వినీత్.జి ఐపిఎస్ గారితో పాటు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.
ఈ పూజా కార్యక్రమంలో ఆయుధాలకు మరియు పోలీసు వాహనాలకు పూజలు నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గోన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్, కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు, ఇల్లందు డిఎస్పీ రమణ మూర్తి, మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు, పాల్వంచ డిఎస్పీ సత్యనారాయణ, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, ఆర్ఐలు సోములు, కామరాజు, దామోదర్, సుధాకర్ మరియు జిల్లాలోని ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.