సాధారణంగా ఎన్నికలు రోజుల వ్యవది లో ఉన్నాయనగా గాలి ఎటువైపు ఉందో తెలిసిపోతుంది.ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా లేక వ్యతిరేకంగా ఉన్నారా అన్నది ప్రభుత్వ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందుతూ ఉంటుంది.
అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా నమ్మకమైన సంస్థల ద్వారా అంతర్గత సర్వేలు చేయించుకుంటాయి.అలా ప్రజాదరణ లో తాము ఎక్కడ ఉన్నామో ఎలా ముందుకెళ్లాలో అన్నదానిపై పార్టీలు విశ్లేషణ చేసుకుంటాయి .అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల ఎన్నికలలో ఓటరు నాడి కొంత అస్పష్టం గా ఉందన్నది రాజకీయ పరిశీలకులు అంచనా .ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు మందస్తు సర్వే ఫలితాలు వెల్లడించినా ప్రజా అభిప్రాయం ఆ సర్వే లలో ప్రతిపలించడం లేదన్నది కొంత మంది వాదన .

ముఖ్యంగా తెలంగాణలో బహుముఖ పోటీ జరుగుతున్నందున ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుందన్నది అంచనా వేయడం పెద్ద సమస్యగా మారింది.తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం ఈ విషయం లో వెనకబడి ఉన్నారని చెప్పవచ్చు .ఇక్కడ ప్రధానంగా పోటీ కాంగ్రెస్ మరియు బారాస మధ్యే అని అంచనాలు వినిపిస్తున్నప్పటికీ భాజపా మరియు ఇతర పార్టీలు చేస్తున్న పోటీ ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది అన్నది ప్రస్తుతానికి అంతుపట్టడం లేదు .బారాస ( BRS party )పరిపాలన లో భారీ ఎత్తున అవినీతి ఉందని, ఈసారి కాంగ్రెస్ కే తెలంగాణ ఓటర్ పట్టం కట్టబోతున్నారంటూ ఒక ఒక వర్గం వాదిస్తుండగా, తలసరి ఆదాయం లో దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన కేసీఆర్కే మరోసారి అందలం దక్కుతుందంటూ మరో వర్గం వాదిస్తుంది.ఇంకోపక్క ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్షేమ పధకాలు బారి ఎత్తున అమలు చేసిన జగన్ కు బ్రహ్మాండమైన ఆదరణ ఉందని ఒక వర్గం, కనీస మౌలిక సదుపాయాల కల్పనలో కానీ ఉద్యోగీతా శాతం పెంచడం లో గాని దారుణంగా ఫెయిల్ అయిన అధికార వైసీపీ పై తీవ్ర స్థాయి వ్యతిరేకత ఉందని పైగా తెలుగుదేశం జనసేన( Janasena ) జోడి విన్నింగ్ జోడి అంటూ కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి.

దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎటువైపు ఉన్నారన్న దానిపై ఇప్పటికి విశ్వసనీయమైన అంచనాలైతే కనిపించడం లేదు.ప్రజలకు కూడా ఎటువైపు ఓటు వేయాలన్న దానిపై స్పష్టతతో లేదా లేక సమయం వచ్చినప్పుడు చూపిద్దామని గుంభనం గా ఉంటున్నారో కూడా తెలియక రాజకీయ పార్టీలు అయోమయానికి గురవుతున్న వాతావరణం కనిపిస్తుంది.