ఈ దెబ్బ తో తమిళంలో ఫుల్ బిజీ అవ్వనున్న మన అందాల రాముడు

కమెడియన్ గా కెరీర్‌ ను ఆరంభించిన సునీల్‌( Comedian Sunil ) ఆ తర్వాత అందాల రాముడు సినిమా తో హీరోగా మారిన విషయం తెల్సిందే.మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుని హీరోగా కొన్నాళ్ల పాటు కంటిన్యూ అయ్యాడు.

 Telugu Comedian Sunil Get Chance In Kollywood Movies,sunil,comedian Sunil,jailer-TeluguStop.com

కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో అందాల రాముడు కమ్‌ సునీల్‌ మళ్లీ కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించాడు.టాలీవుడ్‌ లో కామెడీ రోల్స్ చేస్తున్న సమయంలో పుష్ప( Pushpa ) లో షాకింగ్ పాత్రలో కనిపించాడు.

ఆ పాత్ర కు మంచి రెస్పాన్స్‌ రావడంతో అదే తరహా పాత్ర ను మార్క్ ఆంటోనీ( Mark Antony ) సినిమా లో చేసేందుకు సునీల్‌ రెడీ అయ్యాడు.


Telugu Sunil, Jailer, Kollywood, Mark Antony, Tollywood, Vishal-Movie

తమిళ హీరో విశాల్( Hero Vishal ) నటించిన మార్క్ ఆంటోనీ ట్రైలర్ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడం తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో ఫుల్‌ బిజీగా ఉన్న సునీల్‌ కు ముందు ముందు తమిళం లో వరుసగా సినిమా లు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళ నటుడు విజయ్ సేతుపతి( Vijay Sethupathi )కి ఏమాత్రం తగ్గకుండా సునీల్ ఇక నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా లు చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.ముందు ముందు తమిళం లో ఫుల్ బిజీ అయితే సునీల్ టాలీవుడ్‌ సినిమా లను పట్టించుకుంటాడా లేదా అనేది చూడాలి.

సునీల్‌ కు మార్క్ ఆంటోనీ సినిమా లో మంచి పాత్ర పడింది.ఇక పుష్ప 2 సినిమా లో కూడా సునీల్ కి మంచి పాత్ర ఉంటుంది.

Telugu Sunil, Jailer, Kollywood, Mark Antony, Tollywood, Vishal-Movie

ఇదే రేంజ్ లో ఆయన కెరీర్‌ లో ముందుకు సాగితే తప్పకుండా మరో పదేళ్ల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సునీల్‌ సినిమా లు( Sunil Movies ) ఉంటున్నాయి.అంతే కాకుండా సునీల్ కెరీర్‌ లో మంచి ఫామ్‌ లో ఉన్న సమయంలో మార్క్ ఆంటోనీ చాన్స్ ను దక్కించుకున్నాడు.కనుక తమిళం లో ఫుల్ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube