ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రజల్లో చాలామందికి చిన్నచూపు ఉంటుంది.ప్రభుత్వ ఉద్యోగులు విధులు సరిగ్గా నిర్వహించరని జీతంపై ఉన్న శ్రద్ధ పనిపై ఉండదని చాలామంది భావిస్తారు.
విధులకు సరిగ్గా హాజరు కాని, విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే టీచర్లు సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.అయితే ఒక టీచర్ మాత్రం ఊరి తలరాతను మార్చేసింది.
పిల్లల చదువు కోసం ఆ టీచర్ పడిన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.
కర్నూలు జిల్లాలోని ఆలూరుకు చెందిన కళ్యాణి కుమారి( Kalyani Kumari ) ఆదోనిలో బీఎస్సీ, బీఈడీ చేసి పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో డీఎస్సీ రాశారు.2010 సంవత్సరంలో నాగరకన్వి ప్రాథమిక పాఠశాలలో( Nagarkanvi Primary School ) టీచర్ గా కళ్యాణికి మొదటి పోస్టింగ్ వచ్చింది.ఆ తర్వాత పత్తికొండకు( Pattikonda ) ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవరాళ్లమల తండాలోని ఎంపీపీ స్కూల్ కు ఆమెకు బదిలీ అయింది.
ఆ తండా జనాభా 600 మంది కాగా స్కూల్ కు కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే వచ్చేవారు.
హాజరు పట్టికలో 14 మంది పేర్లు ఉండగా తక్కువ సంఖ్యలో పిల్లలు స్కూల్ కు హాజరు కావడం వల్ల ఆమె ఇబ్బంది పడ్డారు.కళ్యాణి వెళ్లే సమయానికి స్కూల్ పిచ్చి మొక్కలతో ఉండేది.కొంతమంది అక్కడే జూదం ఆడేవారు.
మరి కొందరు అక్కడే తాగి పడిపోయేవారు.భర్త సహాయంతో స్కూల్ ను శుభ్రపరిచిన కళ్యాణి ల్యాప్ టాప్ ద్వారా పిల్లలకు అర్థమయ్యేలా చదువు చెప్పి వాళ్లలో చదువుపై ఆసక్తిని పెంచారు.
గ్రామస్థుల్లో బడిపై కళ్యాణి నమ్మకం పెంచడంతో మరుసటి సంవత్సరం విద్యార్థుల సంఖ్య 10కు చేరింది.2020 సంవత్సరానికి ఆ స్కూల్ విద్యార్థుల సంఖ్య 55 కావడం గమనార్హం.కళ్యాణి కష్టపడుతున్న తీరు గ్రామస్తుల ప్రవర్తనను సైతం మార్చేసింది.కళ్యాణి దగ్గర చదువుకున్న పిల్లల్లో కొంతమంది గురుకులకు ఎంపికయ్యారు.ప్రస్తుతం ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు సైతం కళ్యాణి టీచర్ గా పని చేస్తున్న బడిలో చదువుకుంటున్నారు.కళ్యాణి టీచర్ గా అందించిన సేవలకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి.