తెలంగాణ బిజెపి( Telangana BJP )పై స్పెషల్ ఫోకస్ పెట్టిన బిజెపి అధిష్టానం వరుస వరుసగా కీలక నేతలందరినీ ఢిల్లీకి పిలిపిస్తూ రాజకీయ వ్యూహాల పై చర్చిస్తున్నారు.గ్రూపు రాజకీయాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలో గ్రూపు రాజకీయాలను పెట్టాలనే నిర్ణయంతో బిజెపి అధిష్టానం పెద్దలు ఉన్నారు.ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి చెందడం తో తెలంగాణపై మరింత దృష్టి సారించింది.
కచ్చితంగా తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉంది.అందుకే ముందుగా పార్టీలో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajender ) , కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తో పాటు , మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Rajagopal Reddy )ని ఢిల్లీకి పిలిపించి అనే అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amith shah ), బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు.ఈ చర్చల సారాంశం ఏమిటనేది నేడు ఈటెల రాజేందర్ ప్రకటించబోతున్న నేపథ్యంలో, అకస్మాత్తుగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టానం పెద్దలు ఆదేశించారు.దీంతో బండి సంజయ్ తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీకి బయలుదేరారు.ఈరోజు కేంద్ర బిజెపి పెద్దలతో ఆయన భేటీ కాబోతున్నారు.బిజెపి కీలక నేతలంతా ఢిల్లీలో ఉండగానే బండి సంజయ్ ను ఢిల్లీకి పిలవడం వెనుక కారణాలు ఏమిటనేది ఉత్కంఠ కలిగిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతమైనట్లుగా కనిపిస్తుండడం , ఆ పార్టీలో చేరికలు జోష్ కనిపిస్తుండడంతో, బిజెపి కూడా అలెర్ట్ అవుతుంది.దీంతో పాటు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు గా ఉన్న బండి సంజయ్ ను తప్పించి ఆ స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించబోతున్నారు అనే హడావుడి జరుగుతుండగానే ఇప్పుడు సంజయ్ ను ఢిల్లీకి పిలిపించడం ఆసక్తికరంగా మారింది.