Tammareddy Bharadwaj: చిరంజీవి అలాంటి సినిమాలు చేస్తే మంచిది.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్!

చిరంజీవి, మొహర్ రమేష్ కాంబినేషన్ లో పొందిన భోళాశంకర్ సినిమా( Bhola Shankar ) ఇటీవల విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

 Tammareddy Bharadwaj Comments Chiranjeevi Remakes-TeluguStop.com

ప్రేక్షకులను మాత్రమే కాకుండా మెగా అభిమానులను కూడా ఈ సినిమా తీవ్ర నిరాశపరిచింది.మెగా ఫ్యాన్స్‌కి కూడా ఈ మూవీ నచ్చలేదు.

దీంతో చిరుతో( Chiranjeevi ) పాటు దర్శకుడు మెహర్ రమేశ్‌ పై దారుణంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.గతంలో ఆచార్య సినిమా విషయంలో ఎలా అయితే ట్రోలింగ్స్ ని ఎదుర్కొన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటున్నారు మెగాస్టార్.

రీమేక్ సినిమాలు( Remake Movies ) ఎంత వద్దు అని మొత్తుకుంటున్న కూడా చిరంజీవి వినిపించుకోకుండా చేసి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారని అభిమానులు వాపోతున్నారు.ఇది ఇలా ఉంటే ఉంటే తాజాగా టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ( Tammareddy Bharadwaj ) చిరు రీమేక్స్‌పై కౌంటర్స్ వేశారు.

ఈ సందర్భంగా తిమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.అప్పట్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లకు పని తప్ప మరో ఆలోచన ఉండేది కాదు.ఇప్పటికీ అలాంటి వాళ్లు ఉన్నప్పటికీ.దాన్ని వ్యాపారంగా చూసేవాళ్లు ఎక్కువైపోయారు.

కథ చెప్పమని అడిగితే అప్పట్లో రైటర్స్ సూటిగా సుత్తిలేకుండా చెప్పేవారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, God, Tamma Bharadwaj, Tollywood-Movie

ఇప్పుడేమో ఓపెన్ చేస్తే అని ఎలివేషన్స్ ఇస్తున్నారు.రైటర్స్ డైరెక్టర్స్ కావడం దీనికి కారణమై ఉండవచ్చు.ప్రేక్షకులకు పనికొచ్చే అంశం, అది కూడా నేచురల్‌గా ఉండాలి.

ఇది పక్కనబెట్టి ఏదో చేస్తే సినిమాలు ఆడవు.అలాగే ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, చిరంజీవి.

ఇలా హీరోలందరూ కెరీర్ మొదట్లో మెథడ్ యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది.చిరునే తీసుకోండి.

శుభలేఖ, స్వయంకృషి, రుద్రవీణ, విజేత లాంటి సినిమాలకే అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది.అమిర్ దంగల్ లాంటి సినిమా చిరంజీవి చేసినా జనాలు చూస్తారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, God, Tamma Bharadwaj, Tollywood-Movie

భోళా శంకర్, గాడ్ ఫాదర్( God Father Movie ) లాంటివి చేసి డిసప్పాయింట్ కావడం కంటే నేచురల్ మూవీస్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ. ఇదే విషయాన్ని చిరంజీవితోనూ చెబుదామని ప్రయత్నించాను.కానీ ఎందుకో కుదరలేదు.ఒకప్పటి సినిమాల్లో చిరంజీవిని చూస్తే మన ఇంట్లో మనిషిలా కనిపించేవారు.ఇప్పుడు ఆ చిరంజీవి మళ్లీ కనిపిస్తే చూడాలని ఉంది.అలానే సినిమాలు ఆడుతాయి అనేది నా నమ్మకం అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube