టాలీవుడ్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్నా... ఏమన్నారంటే?

తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతుంది.తెలుగు, తమిళ్, హిందీలో వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తోంది.

 Tamanna Made Sensational Comments About Tollywood Heroes, Tamannaah, Chiranjeev-TeluguStop.com

మెహర్ రమేష్( Mehar Ramesh ) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తమన్నా ( Tamannaah ) హీరోయిన్ గా నటించిన చిత్రం భోళాశంకర్ ( Bhola Shankar ) మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

అయితే తాజాగా హైపర్ ఆది ( Hyper Adi ) నిర్వహించిన ఇంటర్వ్యూలో భాగంగా తమన్న పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది తమన్నాను ప్రశ్నిస్తూ టాలీవుడ్ హీరోల గురించి ఒక వర్డ్ లో తన అభిప్రాయాలను తెలియజేయమని చెప్పారు.దీంతో తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలందరి గురించి ఓకే మాటలో తన అభిప్రాయాలను తెలియజేశారు.చిరంజీవి చాలా యూనిక్ ఆయనలా ఎవరూ ఉండలేరు.

పవన్ కళ్యాణ్ వెరీ మాస్ అండ్ స్టైలిష్ హీరో ప్రభాస్ అందరికీ డార్లింగ్, మహేష్ బాబు చూడటానికి చాలా అందంగా ఉంటారు.

ఎన్టీఆర్ – ఆల్ రౌండర్ ఆయన చేసే డాన్స్ ఫైట్స్ అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి.రామ్ చరణ్ నాకు రాయల్ మ్యాన్, అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, దేశంలోని స్టార్ హీరోల్లో అతను ఒకడు అని తెలిపింది.ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలందరి గురించి తమన్న ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోల వరకు సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube