చంద్రబాబు బంధుత్వాల గురించి కామెంట్స్ చేసిన తలసాని !

ఏపీ పర్యటన లో ఉన్న తెలంగాణ మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ అధినేత చంద్ర బాబు మీద విరుచుకుపడ్డారు.టీడీపీ ని ఏపీలో ఓడించేందుకు తామంతా కృషి చేస్తామని తలసాని చెప్పడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం… బంధుత్వాలు ఉంటే ఉండొచ్చు కానీ… ఆ కారణంగా పార్టీ ని అడ్డంగా పెట్టడం సరికాదని బాబు టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

 Talasani Srinivas Yadav Fires On Chandrababu-TeluguStop.com

అయితే బాబు వ్యాఖ్యలు బాగా వైరల్ అవ్వడంతో దీనిపై శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

అవునులే.నీకు బంధుత్వాలు గురించి ఏమి తెలుసు.ఎంతసేపు రాజకీయమే కావాలి.

చిల్లర రాజకీయాలే కావాలి.ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని రోడ్లు పాలు చేశావు.నేను మాత్రం అలా కాదు.మాకు బందువుల కావల్సిందే.వారికి మర్యాద ఇవ్వవలసిందే.కులానికి మర్యాద ఇవ్వవలసిందే.

ఒక బిసి నేతను పట్టుకుని ఇలా మాట్లాడతావా? ఎపిలో బిసి వర్గాలు బుద్ది చెబుతాయి.నిన్ను ఓడించడానికి బలహీన వర్గాలే కాదు.

ఉన్నత వర్గాలు కూడా సిద్దం గా ఉన్నాయి.తనకు అనేక మంది ఈ విషయం చెప్పారు.

ఖచ్చితంగా మేము ఎపికి వస్తాం…నేను వస్తేనే ఇంత భయపడుతున్నావు.ఇక కెసిఆర్ వస్తే ఎలా ఉంటుందో .ఎన్టిఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్తాపిస్తే,దానికి తీసుకు వెళ్లి కాంగ్రెస్ కాళ్ల వద్ద పడేశావు.ఇదేనా ఆత్మగౌరవం .ఎపిలో చంద్రబాబు ఓటమి తద్యం అంటూ తీవ్రంగా శ్రీనివాస యాదవ్ తనదైన స్టైల్లో మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube