తెలంగాణలో బిజెపి( BJP party ) పరిస్థితి ఎటూ అర్థం కాకుండా ఉంది.ఒకవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో క్రమ క్రమంగా ఆ పార్టీ బలహీనపడుతున్నట్లుగా కనిపిస్తోంది.
కొద్ది నెలల క్రితం వరకు బిజెపిలో మంచి జోష్ కనిపించేది.కీలక నాయకులంతా బీఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరడం, బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బిజెపి బలోపేతం కావడం ఇవన్నీ ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
అయితే ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది చేరికలు నిలిచిపోవడం, పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ వైపు వెళుతూ ఉండడం , అలాగే బిజెపిలో చేరాలని చూసిన చాలామంది కీలక నాయకులు ఇప్పుడు తమ నిర్ణయాన్ని మార్చుకుని కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడం, ఇవన్నీ మరింతగా టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన సమావేశంలో బిజెపి కీలక నేత , కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ( Amit Shah )తెలంగాణలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సూచించారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేసే విధంగా బిజెపి అగ్ర నేతలు దృష్టి సారించారు.మిషన్ 75 టార్గెట్ గా పనిచేయాలని ఏపీ , తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారు.అయినా ఈ విషయంలో ముందుకు వెళ్లడంలో రెండు రాష్ట్రాల నాయకులు వెనుకబడినట్టుగానే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణలో దూకుడు పెంచడం ఇవన్నీ బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.

కర్ణాటకలో బిజెపి విజయం సాధిస్తే .ఆ దోస్తీ తెలంగాణలో కనిపిస్తుందని అంచనా వేసినా, కాంగ్రెస్ ( Congress )విజయం సాధించడంతో తెలంగాణలో పరిస్థితులు తారుమారయ్యాయి.ఆ ప్రభావం తెలంగాణ బిజెపిపై స్పష్టంగా కనిపిస్తోంది.ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేకొద్ది ఉత్సాహంగా ఉంటూ, పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల పార్టీ నేతల్లో కనిపించాల్సి ఉన్నా , ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బిజెపి నాయకుల్లో నిరుత్సాహం అలుముకున్నట్లుగానే పరిస్థితి కనిపిస్తోంది.