సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం ( Gunturu Kaaram )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.మహేష్ బాబు సైతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇకపోతే మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి బిగ్ సి 20 ( Big C 20 )సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలలో మహేష్ బాబు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈయన మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు.అయితే ఈ కార్యక్రమంలో ఎన్నో వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ మహేష్ బాబును ప్రశ్నిస్తూ మీ మొబైల్ రింగ్ టోన్ ( Ring Tone )ఏంటి అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ సైలెంట్ అంటూ సమాధానం ఇచ్చారు.తన మొబైల్ ఎప్పుడు కూడా సైలెంట్ లో ఉంటుందంటూ ఈయన సమాధానం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
తాను సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో తన మొబైల్ ఫోన్ ఎప్పుడు కూడా సైలెంట్ లోనే పెట్టి ఉంటాను అంటూ మహేష్ బాబు ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.సాధారణంగా మహేష్ బాబు బయట కార్యక్రమాలకు పాల్గొనడం చాలా తక్కువ అలాంటిది ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొని మీడియా సమావేశంలో భాగంగా మహేష్ తన వ్యక్తిగత విషయాల గురించి ఈ సందర్భంగా ఎన్నో విషయాలను తెలియజేస్తూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.