ఐపీఎల్‌లో ఆడుతూ రూ.100 కోట్లు సంపాదించిన సునీల్ నరైన్..

విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్‌ ఒక ఆదాయ వనరుగా మారింది.క్రికెట్ ప్లేయర్లు ఇన్నేళ్లు స్వదేశం తరఫున ఆడి సంపాదించిన డబ్బు కంటే ఐపీఎల్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారు.

 Sunil Narine Earns Rs 100 Crore By Playing In Ipl Sunil Raina, 100 Crores, Late-TeluguStop.com

తాజాగా కోల్‌కత్త  నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆటగాడు సునీల్ నరైన్‌ తన జీతం గురించి వెల్లడించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.అతడు గత పది సీజన్లుగా కేకేఆర్ తరఫున ఆడుతూ ఏకంగా రూ.95.6 కోట్లు సంపాదించాడు.ఐపీఎల్ 2022 సీజన్ లో కూడా కేకేఆర్ అతన్ని ఆరు కోట్లు ఇచ్చి సొంతం చేసుకుంది.దాంతో అతడు ఐపీఎల్‌లో రూ.100 కోట్లు సంపాదించిన రెండో విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఆర్‌సీబీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రూ.102 కోట్లు సంపాదించి ఈ మైలురాయిని దాటిన తొలి విదేశీ ప్లేయర్ గా నిలిచాడు.ఆ తర్వాతి స్థానాన్ని సునీల్ నరైన్‌ దక్కించుకున్నాడు.

అయితే ఐపీఎల్లో ఎక్కువ సంపద సంపాదించిన వారిలో ధోనీ మొదటి స్థానంలో ఉన్నాడు.ధోనీ రూ.152.8 కోట్లు, రోహిత్ శర్మ రూ.146.6 కోట్లు, విరాట్ కోహ్లీ రూ.143.2 కోట్లతో వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు.

Telugu Ipl, Latest, Ups, Sunil Raina-Latest News - Telugu

వెస్ట్ ఇండీస్ ప్లేయర్ సునీల్ నరైన్ తన స్పిన్ మాయాజాలంతో, అద్భుతమైన బ్యాటింగ్ తో ఉత్తమ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు.కేకేఆర్ ఓడిపోతున్నప్పుడు కూడా సునీల్ నరైన్ ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు ఉన్నాయి.మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ గా రాణించే సునీల్ ను కేకేఆర్ ఇప్పటికీ అట్టి పెట్టుకునే ఉందంటే అతని ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఐపీఎల్ లో మొత్తం 134 మ్యాచ్‌లు ఆడిన సునీల్ 143 వికెట్లు తీసి రికార్డ్ సృష్టించాడు.

బ్యాట్ మెన్ గా  కూడా రాణించిన సునీల్ 954 పరుగులు చేశాడు.వీటిలో నాలుగు అర్థ శతకాలు కూడా ఉన్నాయి.సునీల్ కేకేఆర్ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించి విజయాలకు కారణమైన సందర్భాలు కూడా కోకొల్లలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube