సుమ షోలో వైఎస్ షర్మిల గురించి సెటైర్లు.. మరీ ఇంతలా టార్గెట్ చేయడం అవసరమా?

బుల్లితెర షోలలో ఒకటైన సుమ అడ్డా షో ( Suma Adda Show )మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటూ బుల్లితెర టాప్ షోలలో ఒకటిగా నిలిచింది.ఈ షోకు అదిరే అభి, సుజిత, విద్యుల్లేఖ రామన్, సుదర్శన్ హాజరయ్యారు.

 Suma Adda Show Punches About Ys Sharmila Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అదిరే అభి సుమతో మీరు ఈ మధ్య ఎందుకండీ హీరోయిన్ త్రిషలా కనిపిస్తున్నారని కామెంట్ చేయగా ఆ కామెంట్ సుమకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.విద్యుల్లేఖ నువ్వు ఎంత ఐస్ వేసినా పాయింట్ పాయింటే అంటూ కామెంట్ చేశారు.

సుమ వెంటనే ఆయన ఐస్ వేశాడు కాబట్టే నేను త్రిషలా కనిపిస్తున్నానని పేర్కొన్నారు.ఆ తర్వాత సుమ జోర్దార్ సుజాతతో( Jordar Sujata ) మీ ఆయన మంచిగున్నాడా అని అడగగా మస్త్ ఉన్నాడు అని చెప్పింది.

ఆ తర్వాత సుమ రాకేశ్( Rakesh ) ను నేను చాలాసార్లు అడిగానని అయితే రాకేశ్ మాత్రం నాకు పెళ్లి అంటే ఆసక్తి లేదని పెళ్లి చేసుకోనని చెబుతూ ఉండేవాడని సుమ పేర్కొన్నారు.ఆ తర్వాత సుమ పెళ్లిచూపులు అనగానే మనకు గొర్తొచ్చేది ఏంటి అని అడగగా టీ, కాఫీ, పండ్లు, పూలు అని అభి, సుజాత కరెక్ట్ గా చెప్పగా మిగతా ఆప్షన్స్ మాత్రం రాంగ్ అయ్యాయి.

Telugu Jordar Sujata, Rakesh, Sudarshan, Suma Adda, Suma Adda Show, Tollywood, Y

సుదర్శన్ ( Sudarshan )తన పెళ్లిచూపుల గురించి చెబుతూ మా నాన్న నీకు అందం లేదని చదువు లేదని సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయావని నీకున్న ప్లస్ ఏదైనా ఉందా అంటే అది నా కొడుకుగా పుట్టడమే అని అన్నాడని వెల్లడించారు.మీకు ఎలాంటి కలలు వస్తాయని సుమ అడగగా ఆస్కార్ విన్ చేయడం లాంటి కలలు వస్తాయని విద్యుల్లేఖ పేర్కొన్నారు.సుదర్శన్ వెంటనే నువ్వు నిద్రపోవద్దు అంటూ పంచ్ వేశారు.

Telugu Jordar Sujata, Rakesh, Sudarshan, Suma Adda, Suma Adda Show, Tollywood, Y

ఆ తర్వాత అదిరే అభి, సుజాత స్టూడెంట్స్ ను స్టూడెంట్స్ అని ఎందుకు అంటారో తెలుసా వాళ్లు స్టూడెంట్స్ కాబట్టి అంటూ వేసిన పంచ్ హాట్ టాపిక్ అవుతోంది.వైఎస్ షర్మిల గతంలో చేసిన కామెంట్లను టార్గెట్ చేస్తూ కించపరిచేలా ఈ ప్రోమో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ప్రోమోకు 53,000కు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ ప్రోమో విషయంలో షర్మిల ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube