గండ్ర దంప‌తుల‌కు విచిత్ర ప‌రిస్థితులు.. జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ పీఠం పోతుందా..?

తెలంగాణ‌లో వ‌రంగ‌ల్ రాజ‌కీయాలు ఎప్పుడూ చాలా విచిత్రంగానే ఉంటున్నాయి.ఎందుకంటే ఇక్క‌డ జిల్లాల మార్పు అనేది మొద‌టి నుంచి చాలా టెన్ష‌న్ పెడుతూనే ఉంది.

 Strange Circumstances For Gandra Couple Will Zadpi Chair Chair Pedestal Be Lost-TeluguStop.com

ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటూ వేరే జిల్లాలో ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నేత‌లే ఎక్కువ‌గా ఉంటున్నారు.భౌగోళికంగా ఒక జిల్లాలో ఉన్నా కూడా దాని నియోజ‌క‌వ‌ర్గ మండ‌లాలు మాత్రం వేరే జిల్లాలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇక ఇప్పుడు భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మణారెడ్డి దంప‌తులకు ఇప్పుడు కొత్త చిక్కులు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం గండ్ర జ్యోతి వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్‌గా గండ్ర జ్యోతి కొన‌సాగుతున్నారు.

అయితే ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న శాయంపేట మండ‌లం కాస్తా ఇన్ని రోజులు వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో ఉన్నా కానీ ఇప్పుడు అది కాస్త హన్మ‌కొండ జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చింది.ఇక్క‌డే అస‌లు చిక్కు వ‌చ్చి ప‌డింది.

అదేంటంటే ఆమె ఇన్ని రోజులు వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా జ‌డ్పీ చైర్ ప‌ర్సన్‌గా ఉన్నారు.కాగా ఇప్పుడు దాన్ని వ‌రంగ‌ల్ జిల్లాగా మార్చేయ‌డంతో ఆమె మండ‌లం కాస్తా హ‌న్మ‌కొండ జిల్లా కిందికి వ‌చ్చింది.

Telugu Gandra Jyothi, Strangegandra, Warangal Rural-Telugu Political News

మ‌రి ఒక జిల్లాలో జ‌డ్పీటీసీగా ఉంటూ వేరే జిల్లాలో జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్‌గా ఎలా కొన‌సాగుతారంటూ అంతా ప్ర‌శ్నిస్తున్నారు.కాగా ఇది త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తును ఇబ్బందుల్లో ప‌డేసేందుకు కొంద‌రు కావాల‌నే చేశారంటూ గండ్ర అభిమానులు వాపోతున్నారు.ఏదేమైనా ఇప్పుడు దీనిపై పూర్తి స్ప‌ష్టత వ‌చ్చే వ‌ర‌కు ఎవ‌రూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవ‌ద్ద‌ని అధికారులు సూచిస్తున్నారు.ఇక జ‌డ్పీ సీఈవో అయితే ఒక అడుగు ముందుకు వేసి వ‌రంగ‌ల్‌లో పాత పాల‌క‌వ‌ర్గ‌మే కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

మొత్తానికి గండ్ర దంప‌తుల‌కు పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube