Feet : నల్లగా అసహ్యంగా మారిన పాదాలను ఒక్క వాష్ లోనే వైట్ గా బ్రైట్ గా మార్చే ఎఫెక్టివ్ రెమెడీ ఇది!

సాధారణంగా కొందరి పాదాలు ( feet )చాలా అందంగా తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంటాయి.కానీ కొందరి పాదాలు మాత్రం నల్లగా అసహ్యంగా ఉంటాయి.

 This Remedy Helps To Make Feet White And Bright In Just One Wash-TeluguStop.com

బయటకు బహిర్గతమయ్యే శరీర భాగాల్లో పాదాలు ఒకటి.అటువంటి పాదాలను అందంగా మెరిపించుకోవడం అనేది మన బాధ్యత.

ఈ క్రమంలోనే పాదాల విషయంలో కొందరు ఎంతో కేర్ తీసుకుంటారు.నెలకు ఒకసారి అయినా పెడిక్యూర్( Pedicure ) చేయించుకుంటారు.

కొందరు మాత్రం పాదాలను అస్సలు పట్టించుకోరు.దీంతో అవి మురికి పట్టి నల్లగా అసహ్యంగా మారుతుంటాయి.

ఇక అప్పుడు పాదాలను రిపేర్ చేసుకునేందుకు హైరానా పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ రెమెడీ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీతో కేవలం ఒక్క వాష్ లోనే పాదాలను వైట్ గా బ్రైట్ గా మెరిపించుకోవచ్చు.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి ( rice flour )వేసుకోవాలి.

Telugu Dark Feet, Feet, Feet Remedy, Care, Remedy, Latest, Remedyhelps, White Fe

అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్( Sugar powder ), హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా,( baking soda ) హాఫ్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ మరియు సరిపడా నిమ్మరసం వేసుకొని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై అర నిమ్మ చెక్కను తీసుకుని పాదాలను బాగా రుద్దాలి.

కనీసం ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు నిమ్మ చెక్కతో పాదాలను స్క్రబ్బింగ్ చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Dark Feet, Feet, Feet Remedy, Care, Remedy, Latest, Remedyhelps, White Fe

ఇప్పుడు త‌డి లేకుండా పాదాలను తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటించడం వల్ల పాదాలపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.టాన్ రిమూవ్ అవుతుంది.

ఒక్క వాష్ లోనే మీ పాదాల్లో చాలా మార్పును గమనిస్తారు.ఈ రెమెడీ మీ పాదాలను తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది.

వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటించారంటే ఎల్లప్పుడూ మీ పాదాలు అందంగా మెరిసిపోతూ కనిపిస్తుంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube