ఏపీలో సీపీఎస్ సమస్యను పరిష్కరించేందుకు అడుగులు ముందుకు వేశామని సీఎం జగన్ తెలిపారు.ఇందుకోసం మనసు పెట్టి అడుగులు వేస్తున్నామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేయాలనేదే తన తపనని చెప్పారు.గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అడ్డగోలుగా వ్యవహరించిందని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని కోరారు.ఉద్యోగుల కోసం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గ్యారెంటీ స్కీమ్ ను తీసుకువచ్చామని తెలిపారు.
పెన్షన్ స్కీమ్ దేశమే కాపీకొట్టే రోజు వస్తుందన్నారు.ప్రభుత్వంపై ఎక్కువ భారం పడకుండా ఉద్యోగులకు న్యాయం జరిగేలా స్కీమ్ ఉందన్న ఆయన రెండు లక్షల 6 వేలకు పైగా ఉద్యోగులను నియమించామని వెల్లడించారు.