మహేష్ త్రివిక్రమ్ ( Trivikram Srinivas )కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు, ఖలేజా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా ఈ సినిమాలు బుల్లితెరపై క్లాసిక్ గా నిలిచాయి.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ కానుందని మరోసారి క్లారిటీ వచ్చేసింది.
మహేష్ కన్ఫామ్ చేయడంతో గుంటూరు కారం మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అయితే గుంటూరు కారం ( Gunturu karam movie )మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ కు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వైరల్ అవుతోంది.ఫస్టాఫ్ మొత్తం క్లాస్ గా కనిపించిన మహేష్ బాబు ఇంటర్వెల్ లో షాకింగ్ ట్విస్ట్ ఇవ్వడంతో పాటు ఊరమాస్ అవతార్ లో కనిపిస్తారని సమాచారం అందుతోంది.ఈ సినిమాలో సెకండాఫ్ సీరియస్ గా సాగుతుందని మాస్ అవతార్ లో మహేష్ బాబు పర్ఫామెన్స్ మామూలుగా ఉండని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ గుంటూరు కారం మూవీ డిజిటల్ హక్కులను ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మహేష్, శ్రీలీల ( Sreeleela )కాంబో సీన్లు అదుర్స్ అనేలా ఉంటాయని తెలుస్తోంది.
మహేష్ శ్రీలీల కాంబోను భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో కూడా రిపీట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మహేష్ శ్రీలీల జోడీ చూడచక్కగా ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థమన్ ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారని తెలుస్తోంది.ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
గుంటూరు కారం మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
త్రివిక్రమ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.