తక్కువ సమయం లో ఎక్కువ గుర్తింపు పొందాలి అంటే సినీ పరిశ్రమకే అది సాద్యం అని చెప్పాలి.ఇక్కడ చాలామంది సెలబ్రిటీలు తక్కువ టైమ్ లోనే గణనీయంగా ఫాలోయింగ్ పెంచుకుని సినీ ప్రపంచాన్ని ఏలుతున్న వారు ఉన్నారు.
తమ అభిమాన హీరో, హీరోయిన్ల అంటే పిచ్చి ప్రేమ చూపిస్తుంటారు అభిమానులు.వారి స్టైల్ ను ఫాలో అవ్వడం, డైలాగులు చెప్పడం, డ్రెస్సింగ్ స్టైల్ ను అనుసరించడం సదా మామూలే.
అయితే సెలబ్రెటీల క్రేజ్ ను ఉపయోగించుకుని తమ కంపెనీ ప్రొడక్ట్ ల సేల్ పెంచేందుకు చాలామంది వ్యాపారస్తులు ఆసక్తి కనుబరుస్తున్నారు.
అదేవిధంగా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అందిన యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు సెలబ్రిటీలు.
అయితే ఇక్కడ మ్యాటర్ మనీ మాత్రమే కాదు అన్న విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది.ఎందుకంటే స్టార్ సెలబ్రిటీలకు సమాజం పట్ల బాధ్యత కూడా ఉంది.
ఎందుకంటే వారు సినిమాల్లో ఇచ్చే మెసేజ్ అయిన, యాడ్ ద్వారా ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్ అయిన వినియోగించడానికి, ఫాలో అవడానికి ఇష్టపడతారు జనాలు.అలాంటప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యాక వేసే ప్రతి అడుగు, చేసే ప్రతినినీ కూడా దూరదృష్టితో ఆలోచించాలి, సొసైటీకి మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేయక పోతే చాలు.
కానీ కొందరు స్టార్ సెలబ్రెటీలు మాత్రం సమాజం ఎటు పోతే ఎంటి మాకు డబ్బే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
మరికొందరు తమ తప్పును తెలుసుకుని జాగ్రత్త పడుతున్నారు.ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది బిగ్ బి పేరే….అప్పట్లో ఈ సారు ఒక గుట్కా యాడ్ చేసి విమర్శలను ఎదుర్కొన్నారు.
అయితే ఆ తరవాత తన తప్పు తాను తెలుసుకుని తన తప్పు ను తప్పు అని ఒప్పుకోవడానికి ఏమాత్రం ఫీల్ అవకుండ అంతా పెద్ద స్టార్ అయింది కూడా.ఇది తప్పే ఇకపై ఇలాంటి యాడ్ చేయను,తీసుకున్న డబ్బును సైతం తిరిగి పంపిస్తున్నాను అంటూ ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు.
అయితే మహేష్ బాబు, సమంత లాంటి బడా స్టార్ లు మాత్రం ఇలాంటివి చేస్తూ డబ్బే ప్రాధాన్యం అన్నట్లు ఉండటం అందరినీ బాధపడుతోంది.మహేష్ బాబు లాంటి ఒక పెద్ద హీరో కూల్ డ్రింక్స్ ,పాన్ మసాలా వంటి యాడ్స్ లలో నటించడం అందరికీ షాక్ ఇచ్చింది.మహి విమర్శలు ఎదుర్కొనేలా చేసింది అయిన మహి నుండి ఎటువంటి స్పందన ఇప్పటికీ రాకపోవడంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.చిన్నారులకు ప్రాణదానం చేసే ఈ హీరో ఇలాంటి పనులు చేయడం ఎంటి చీ చీ అంటున్నారు.
బాలీవుడ్ బడా బాయ్ అక్షయ్ కుమార్ కూడా ఇలాంటి గుట్కా యాడ్స్ నే చేసి ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు.కానీ లీగల్ గా కొన్ని అగ్రిమెంట్స్ కారణంగా ఇప్పుడే వైదొలగలేనని ఇకపై ఇలాంటి యాడ్స్ చేయనంటు చెప్పుకొచ్చారు.
ఇక షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి హీరోలు సైతం ఈ గుట్కాయాడ్ ను చాలా ప్రౌడ్ గ చేసేస్తున్నారు.మరి వీరంతా ఎప్పటికీ తెలుసుకుంటారో ఏమిటో.
అంతేనా .ఈ మధ్య స్టార్ హీరోయిన్ సమంత సైతం ఒక ఆల్కహాల్ యాడ్ ను చేసి వివాదాల్లో చిక్కుకుంది.వీరు ఇంత పెద్ద సెలబ్రిటీలు అయిండి, సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేస్తుండి కూడా ఇలాంటి చిన్నచిన్న పొరపాట్ల వలన తమ కీర్తిని పోగొట్టుకుంటున్నారు.సాయి పల్లవి లాంటి మరికొందరు సెలబ్రిటీలు మాత్రం ఇలాంటి సమాజానికి కీడు చేసే యాడ్స్ చేయబోయేది లేదంటూ ఆ ఆఫర్ లను ఎడమ చేత్తో నెట్టేస్తున్నారు
.