అభిమానులకు శుభవార్త చెప్పిన స్టార్ సింగర్ సునీత.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ సింగర్లలో ఒకరైన సునీతకు సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.గుంటూరు జిల్లాకు చెందిన సునీత గులాబి, ఎగిరే పావురమా సినిమాలతో మంచి పేరును సొంతం చేసుకున్నారు.

 Star Singer Sunitha Good News To Fans Details Here Goes Viral , Fans, Good News,-TeluguStop.com

చిన్న వయస్సులోనే గాయనిగా కెరీర్ ను మొదలుపెట్టిన సునీత వేల సంఖ్యలో పాటలను పాడటంతో పాటు 500 కంటే ఎక్కువ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు.

అయితే తాజాగా సింగర్ సునీత అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.

ఒకవైపు సునీత సింగర్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.అభిమానులకు సునీత ఇకపై వన్ మినిట్ వీడియో రీల్ చేస్తానని అదిరిపోయే తీపికబురు అందించారు.

ఇందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.సునీత వెల్లడించిన విషయాలు ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలుగజేస్తున్నాయి.

సునీత ఏ పాట పాడినా ఆ పాటకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం అయితే లేదు.కొంతమంది హీరోయిన్లకు సునీత చెప్పిన డబ్బింగ్ ఆయా సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.3,000కు పైగా పాటలు పాడిన సింగర్ సునీత రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.19 సంవత్సరాల వయస్సులోనే సునీతకు పెళ్లి కాగా కొన్ని రీజన్స్ వల్ల మొదటి భర్తతో ఆమె విడిపోయారు.

Telugu Fans, Sunitha-Movie

ఆ తర్వాత సునీత ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన రామ్ వీరపనేనిని గతేడాది పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.సునీత రెండో పెళ్లి చేసుకోవడంపై కొంతమంది విమర్శలు చేసినా సునీత మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు.సునీత తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube