సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కేదరినాథ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ తొలి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు నటిగా మంచి పేరును సంపాదించుకున్నారు.
వరుసగా సినిమాల్లో నటిస్తూ సారా అలీఖాన్ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
తాజాగా సారా అలీఖాన్ చెప్పిన ఒక విషయాన్ని విని షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.
సినిమాలలోని కొన్ని సన్నివేశాలలో నటించిన నటులు రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటారని కొంతమంది భావిస్తారు.లోకజ్ఞానం లేని వాళ్లు ఎక్కువగా ఈ తరహా ఆలోచనలను కలిగి ఉంటారు.
సారా అలీఖాన్ తల్లి అమృతా సింగ్ తండ్రి సైఫ్ అలీ ఖాన్ ఇద్దరూ నటులనే సంగతి తెలిసిందే.సారా అలీఖాన్ బాల్యంలో తల్లి నటించిన కల్యూగ్ అనే మూవీని తండ్రి నటించిన ఓంకారా అనే మూవీని చూశారు.
కల్యూగ్ సినిమాలో అమృతా సింగ్ అశ్లీల చిత్రాల సైట్ ను నడిపే మహిళగా నటించింది.ఓంకార్ సినిమాలో సైఫ్ అలీఖాన్ ఎప్పుడూ బూతులు తిడుతూ ఉంటాడు.ఆ సన్నివేశాలను చూసిన సారా అలీఖాన్ రియల్ లైఫ్ లో కూడా తన తల్లి, తండ్రి అదే విధంగా ఉంటారని భావించారు.ఈ రీజన్ వల్లే ఆమె తల్లిదండ్రులతో కూడా సరిగ్గా ఉండలేకపోయారని సమాచారం.
తాజాగా ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్న సారా అలీఖాన్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత తనకు లోకజ్ఞానం తెలిసిందని రీల్ లైఫ్ కు రియల్ లైఫ్ కు సంబంధం లేదని తనకు అర్థమైందని సారా అలీఖాన్ అన్నారు.
అప్పటినుంచి పేరెంట్స్ తో సన్నిహితంగా ఉండేదానినని సారా అలీఖాన్ చెప్పుకొచ్చారు.చాలామంది పిల్లలు ఇలాంటి భావనలను కలిగి ఉంటారని సారా అలీఖాన్ అన్నారు.