రాత్రి 9 గంటలకు కాల్ చేసి ఆ స్టార్ హీరో వేధించాడు.. నటి సంచలన వ్యాఖ్యలు!

ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు వేధింపులకు సంబంధించిన ఘటనల గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.తాజాగా ప్రముఖ నటి ఒకరు స్టార్ హీరో తనను వేధింపులకు గురి చేశాడంటూ సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

 Star Hero Shocking Comments Goes Viral In Social Media Details Here, Yamini S-TeluguStop.com

ప్రముఖ భోజ్ పురి నటీమణులలో ఒకరైన యామిని సింగ్ పవన్ సింగ్ అనే నటుడిపై సంచలన ఆరోపణలు చేశారు.

పవన్ సింగ్ వల్లే నాకు సినిమా ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోందని అమె కామెంట్లు చేశారు.

అయితే ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆమె పేర్కొన్నారు.దర్శకుడు అరవింద్ చౌబే వల్ల నాకు ఫస్ట్ మూవీ ఆఫర్ వచ్చిందని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

బాస్ మూవీ నుంచి నన్ను ఎవరూ తొలగించలేదని నేనే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని యామినీ సింగ్ చెప్పుకొచ్చారు.

ఆ సినిమాలో నటించే సమయానికి పవన్ మంచి నటుడు అని నాకు తెలుసని సెట్స్ లో తొలిసారి కలిసిన సమయంలో పవన్ తో తాను ఆ విషయాన్ని చెప్పానని యామిని కామెంట్లు చేశారు.

అప్పటివరకు అతని నిజస్వరూపం తెలియదని ఆమె అన్నారు.రాత్రి 9 గంటల సమయంలో అతని నుంచి నాకు కాల్ వచ్చిందని ఆటోలో స్టూడియోకు రమ్మని అతను అడిగాడని రానని చెబితే సినిమా చేయాలని ఉందా లేదా అని అన్నాడని యామిని పేర్కొన్నారు.

ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకున్నానని ఆమె వెల్లడించారు.ఆ తర్వాత అతని నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆమె పేర్కొన్నారు.పవన్ సింగ్ లాంటి వ్యక్తులను కఠినంగా వేధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube