రాత్రి 9 గంటలకు కాల్ చేసి ఆ స్టార్ హీరో వేధించాడు.. నటి సంచలన వ్యాఖ్యలు!

ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు వేధింపులకు సంబంధించిన ఘటనల గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

తాజాగా ప్రముఖ నటి ఒకరు స్టార్ హీరో తనను వేధింపులకు గురి చేశాడంటూ సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ప్రముఖ భోజ్ పురి నటీమణులలో ఒకరైన యామిని సింగ్ పవన్ సింగ్ అనే నటుడిపై సంచలన ఆరోపణలు చేశారు.

పవన్ సింగ్ వల్లే నాకు సినిమా ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోందని అమె కామెంట్లు చేశారు.

అయితే ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆమె పేర్కొన్నారు.దర్శకుడు అరవింద్ చౌబే వల్ల నాకు ఫస్ట్ మూవీ ఆఫర్ వచ్చిందని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

బాస్ మూవీ నుంచి నన్ను ఎవరూ తొలగించలేదని నేనే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని యామినీ సింగ్ చెప్పుకొచ్చారు.

ఆ సినిమాలో నటించే సమయానికి పవన్ మంచి నటుడు అని నాకు తెలుసని సెట్స్ లో తొలిసారి కలిసిన సమయంలో పవన్ తో తాను ఆ విషయాన్ని చెప్పానని యామిని కామెంట్లు చేశారు.

అప్పటివరకు అతని నిజస్వరూపం తెలియదని ఆమె అన్నారు.రాత్రి 9 గంటల సమయంలో అతని నుంచి నాకు కాల్ వచ్చిందని ఆటోలో స్టూడియోకు రమ్మని అతను అడిగాడని రానని చెబితే సినిమా చేయాలని ఉందా లేదా అని అన్నాడని యామిని పేర్కొన్నారు.

"""/"/ ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకున్నానని ఆమె వెల్లడించారు.ఆ తర్వాత అతని నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆమె పేర్కొన్నారు.

పవన్ సింగ్ లాంటి వ్యక్తులను కఠినంగా వేధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కల్కి సీక్వెల్ రిలీజయ్యేది అప్పుడేనా.. అన్ని నెలలు ఆగితే కల్కి సీక్వెల్ ను చూడొచ్చా?