గతేడాది అక్కినేని హీరో నాగచైతన్య విజయాలు సాధించాడనే సంతోషం కంటే చైసామ్ విడిపోతున్నట్టు చేసిన ప్రకటన వల్లే అక్కినేని అభిమానులు ఎంతగానో బాధ పడ్డారు.సామ్ జామ్ షో ప్రసారమైన సమయంలో అన్యోన్యంగానే ఉన్న చైతన్య సమంత కొన్ని నెలల గ్యాప్ లోనే విడిపోయారు.
నాగచైతన్య ఇప్పటికే సమంతతో విడిపోవడం గురించి స్పందించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.విడిపోవడం వల్ల తాను, సమంత సంతోషంగానే ఉన్నామని చైతన్య అన్నారు.
బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున చైసామ్ విడాకుల గురించి స్పందిస్తూ విడాకుల గురించి వెల్లడించిన సమయంలో చైతన్య చాలా బ్యాలెన్సడ్ గా ఉన్నాడని అలా చైతన్య ఉండటం గురించి గర్వంగా ఫీలవుతున్నానని చెప్పుకొచ్చారు.విడాకుల ప్రకటన చేసిన తర్వాత నాగచైతన్య ఒక్క మాట కూడా మాట్లాడలేదని నాగ్ అన్నారు.
విడాకుల ప్రకటన తర్వాత తాను కూడా ఒక తండ్రిగా ఎంతో బాధ పడ్డానని నాగ్ చెప్పారు.
విడాకుల ప్రకటన వల్ల తాను ఆందోళన చెందానని నాగార్జున వెల్లడించారు.
అయితే చైతన్య మాత్రం రివర్స్ లో తాను ఓకేనా అని అడిగాడని నాగార్జున కామెంట్లు చేశారు.
డివోర్స్ నిర్ణయం చైసామ్ వ్యక్తిగత విషయమని నాగార్జున పేర్కొన్నారు.విడిపోయినా ఇద్దరూ సంతోషంగా ఉంటే తనకు అదే చాలని నాగార్జున అన్నారు.నాగ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విడాకులు తీసుకున్నా ఆ బాధ నుంచి కోలుకుని నాగచైతన్య సంతోషంగా ఉండటంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.మరోవైపు నాగార్జున, చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాగా బంగార్రాజు సినిమా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బంగార్రాజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.