ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 రోజులు స్టాండ్‌ బై.. త్వరలో మార్కెట్‌లోకి సరికొత్త వాచ్

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి.

 Stand By For 30 Days On One Charge New Watch In The Market Soon , Smart Watch,-TeluguStop.com

వీటిని ధరించిన వారు చాలా మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు.మన శరీరంలోని హృదయ స్పందన నుంచి బీపీ వరకు ఎన్నో వివరాలకు కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి.

అలాంటి పరిస్థితుల్లో యాపిల్ స్మార్ట్ వాచ్‌లు వంటివి మనకు రక్షణగా నిలుస్తున్నాయి.ఈ తరుణంలో యాపిల్ వాచ్‌లను తలదన్నేలా సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి స్మార్ట్‌ వాచ్‌లు వస్తున్నాయి.

తాజాగా వన్ ప్లస్ సంస్థ OnePlus Nord వాచ్‌ను త్వరలో ఇండియా మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.దీని ఫీచర్లు ఇవేనంటూ కొన్ని లీకులు బయటికి వచ్చాయి.

దీంతో వాటిపై టెక్ ప్రియుల్లో మరింత ఆసక్తి పెరిగింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Telugu Charge, Smart, Smart Watch-Latest News - Telugu

వన్‌ప్లస్ నోర్డ్ వాచ్‌ను ముదురు నీలం, నలుపు రంగులలో రానుంది.దీర్ఘచతురస్రాకార రూపంలో స్క్రీన్ ఉండనుంది.స్క్రీన్ కుడివైపు ఫిజికల్ బటన్‌ పెట్టారు.ఇది ఆపిల్ వాచ్‌ను ధరించిన అనుభూతిని అందిస్తుంది.ఈ వాచ్‌లో హృదయ స్పందన రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, ఒత్తిడి, నిద్రపై గణాంకాలతో సహా ఎన్నో వివరాలను మనకు అందిస్తుంది.దీని స్క్రీన్ 1.78 అంగుళాలు ఉండనుంది.60Hz AMOLED డిస్‌ప్లే ప్యానెల్ ఏర్పాటు చేశారు.ఇందులో 105 ఫిట్‌నెస్ మోడ్‌లు ఉన్నాయి.ఇక ఈ ఫోన్ బ్యాటరీ అందరిలోనూ ఎంతో ఆసక్తి రేపుతోంది.ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 రోజుల స్టాండ్ బై అందించనుంది.ఇదే అన్నిటి కంటే ఎక్కువగా అందరినీ ఆకర్షిస్తోంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు, ఐఫోన్‌లు రెండింటిలోనూ పని చేయబోతోంది.గేర్ 105 ఫిట్‌నెస్ మోడ్‌లు, హీత్ మానిటరింగ్ ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది.

ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ భారతీయులకు అందుబాటు ధరలోనే లభించనుంది.దీని ధర రూ.5000లు ఉండనున్నట్లు అంచనాలున్నాయి.అదే నిజమైతే భారతీయ మార్కెట్‌లో దీనికి మంచి స్పందన వస్తుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube