నిఖిల్ స్పై ఓటీటీ పార్ట్నర్ గా ప్రముఖ సంస్థ.. ఎవరంటే?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్( Hero Nikhil Siddharth ) తాజాగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ”స్పై”.ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది.

 Spy Digital Streaming Partner, Amazon Prime Video, Nikhil Siddharth, Spy Movie,-TeluguStop.com

బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈ రోజు వచ్చింది.ట్రైలర్ రిలీజ్ తర్వాత భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో పాటు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది.

మరి ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ వచ్చినట్టు తెలుస్తుంది.అక్కడ మంచి ఓపెనింగ్స్ కూడా అందుకున్నాయి.ఇక ఇక్కడ రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ అందుకుంటుందో వేచి చూడాలి.ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్( Iswarya Menon ) హీరోయిన్ గా నటించగా ఆర్యన్ రాజేష్ కూడా కీలక పాత్రలో నటించాడు.

ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

ఇక ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా కథ కూడా అందించారు.మరి నిఖిల్ వరుసగా రెండు హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో రెండు హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

మరి స్పై సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.
ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ పార్ట్నర్ ను లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఓటిటి రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime ) సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.థియేటర్స్ రన్ తర్వాత అమెజాన్ లో అందుబాటులో ఉండబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube