YCP Jayaho BC Meeting : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక బిసిలకు ప్రాధాన్యత : స్పీకర్ తమ్మినేని సీతారాం

బిసి లను ఎంతోమంది పాలకులు నిర్లక్ష్యం తో చూశారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక బిసిలకు ప్రాధాన్యత ఇచ్చారు.

 Speaker Tammineni Sitaram About Jayaho Bc Meeting In Vijayawada,tammineni Sitara-TeluguStop.com

సామాజిక న్యాయం, దామాషా ప్రకారం అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.బిసి లంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు…‌ భారతదేశానికే బ్యాక్ బోన్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

బిసి అంటే భారతదేశ నాగరికత, సంస్కృతి,వృత్తి నైపుణ్యం తో మన దేశాన్ని ముందుకు నడిపింది బిసి లే.అన్నం పెట్టే రైతుల్లో యనభై శాతం బిసి లే.అటువంటి బిసి లను అధికారం‌ మాటున అణగ దొక్కారు.జగన్మోహన్ రెడ్డి వారికి చేయూతను ఇచ్చి ముందుకు నడిపిన హానుభావుడు.

బిసిలు అంతా కలిసి రేపు ఐక్యతా సందేశం ఇవ్వాలి.

బిసి గర్జన ద్వారా జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

గడిచిన ప్రభుత్వం బిసి లకు 964కోట్లు మాత్రమే కేటాయించింది.వైసిపి మూడేళ్ల లో 90,415 కోట్లు బిసి ల సంక్షేమం కోసం ఇచ్చింది.

బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లకు జగన్ ప్రభుత్వం చేసిన విధంగా ఎవరూ చేయలేదు.వచ్చే ఎన్నికలలో సిఎం ను చేయడానికి బిసి జాతులంతా సిద్దం గా ఉన్నాయి.

బిసి ప్రాంతం విశాఖలో రాజధాని పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.జగన్మోహన్ రెడ్డి ఎంతో ధైర్యం తో తీసుకున్న నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.

మూడు ప్రాంతాలను రాజధానలను‌ చేస్తూ అందరికీ సమ న్యాయం పాటించారు.జయహో బిసి, జయహో జగన్ అనే నినాదంతో వెళతాం.

నేను బిసి గా రేపు బిసి గర్జన లో పాల్గొంటున్నా నేను స్పీకర్ నే .ముందుగా వైసిపి కార్యకర్తని, బిసిని ప్రజలు నన్ను ఎమ్మెల్యే గా గెలిపిస్తే… జగన్మోహన్ రెడ్డి నన్ను శాసనసభాధిపతిగా చేశారు.సిఎం ఎక్కడి నుంచి‌ పాలన చేస్తే.అదే రాజధాని చట్ట సభకు.మీరు శాసనాలు చేయవద్దని హైకోర్టు కు సుప్రీంకోర్టు చెప్పింది కదా మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం పెడితే అసెంబ్లీ లో చర్చకు పెడతాం.ప్రస్తుతానికి సమావేశాలు పెట్టాలని ఇంకా సమాచారం అందలేదు.

జగన్ రెడ్డే కాదు… బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ.అన్నీ చంద్రబాబు ‌పై ఉన్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకో లేదు.

జగన్మోహన్ రెడ్డి యాభై శాతం సీట్లు రేపు బిసి లకు ఇస్తారు.బిసి జనగణన భారత ప్రభుత్వం చేయాలి.

మాకు అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చేసే వారు.ఎంతటి గొప్ప‌ నాయకుడైనా మా పార్టీ లైన్ లో పని చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube