వైరల్ : కేవలం వీడియో గేమ్స్ ఆడుతూనే నెలకు రూ.36 లక్షల ఆదాయం..!

ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్  ఫోన్ వినియోగం, సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ తరుణంలో చాలా వరకు ఎక్కువగా మొబైల్స్, లాప్టాప్స్ లేదా కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.

 South Korean Boy Man Earning 36 Lac Per Month By Playing Video Games ,viral , Vi-TeluguStop.com

అయితే మీరు ఎప్పుడైనా గేమ్స్ ఆడుతూ ఏదైనా సంపాదించారా.? లేదా  డబ్బు సంపాదించే గేమ్స్ కూడా ఉన్నాయా అని ఆలోచించారా.?

ఇది ఇలా ఉండగా తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఒక యువకుడు ఇంట్లోనే ఉంటూ వీడియో గేమ్స్ ఆడడం ద్వారా ప్రతి నెల 36 లక్షల వరకు సంపాదిస్తున్నాడు అంటే నమ్మండి.ఆ  యువకుడి  సంవత్సరం ఆదాయాన్ని చూస్తే సుమారు 4.32 కోట్లు.ఏ బ్యాంక్, పెద్ద కంపెనీ  ఉద్యోగి కూడా ఇతని లాగా సంపాదించాలి.

కానీ ఈ యువకుడు కేవలం కంప్యూటర్ లో గేమ్స్ ఆడడం ద్వారానే ఇంత పెద్ద  మోతాదులో డబ్బు ను సొంతం చేసుకుంటున్నాడు.

Telugu Lac, Broad Jockey, Live Stream, Korea, Latest-Latest News - Telugu

పూర్తి వివరాల్లోకి వెళితే.దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ చెందిన కిమ్ మిన్-క్యో కిమ్.అపార్ట్మెంట్  లో స్టోర్ రూంలో కూర్చొని వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు.

రోజుకు 15 గంటలు వీడియో గేమ్స్ ఆడడం ఆ యువకుడికి ఒక అలవాటు.  దీని ద్వారా నెలకి 36  లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు.

 కిమ్  అభిమానులు అతడి ఆటను ప్రత్యక్షంగా వీక్షిస్తారట, అలా ఆ యువకుడు డబ్బును సొంతం చేస్కుంటున్నాడు.ఇలా అభిమానులను అలరించడానికి ఫన్నీ కామెంట్రీ కూడా వినియోగిస్తూ ఉంటారు.

ఇక దక్షిణ కొరియాలో ఇలాంటి లైవ్ స్ట్రీమ్ లను  బ్రాడ్ కాస్టింగ్ జాకీలు లేదా బిజె అని పిలుస్తారట. దక్షిణ కొరియాలో బిజెలు లో చాటింగ్,  గేమింగ్,  డాన్సింగ్ ,మ్యూజిక్, తినడం, నిద్రించడం లాంటివి వీక్షించి వినోదాన్ని పొందుతారట.

కొంత మంది  ప్రకటనలతో డబ్బు సంపాదించడం స్పాన్సర్షిప్, యూట్యూబ్లో అభిమానుల ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ల ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.అయితే కొంత మంది దాదాపు నెలకు 1 మిలియన్  డాలర్లను కూడా సంపాదించేవారు కూడా ఉన్నారంటే నమ్మండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube