వైరల్: ఇది విన్నారా? కేవలం రూ.96లక్షలకే దేవుడితో మీటింగ్ ఏర్పాటుచేస్తారట..

అదేంటి? దేవుడితో మీటింగా? బుర్రగాని పోయిందా ఏమిటి? అని అనుకోకండి.మీరు వింటున్నది నిజమే.

 South African Pastor Offers Meeting With God In Heaven,south African Pastor,meet-TeluguStop.com

మీరు దేవుడిని చూడాలని, ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ చెప్పిన మొత్తాన్ని చెల్లిస్తే మిమ్మల్ని సరాసరి దేవుడి దగ్గరకే పంపిస్తారట.స్వర్గంలో దేవుడితో మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తా! అంటూ పేర్కొన్న పోస్టర్లు ప్రస్తుతం నెటింట తెగ వైరల్ అవుతున్నాయి.

దీంతో సదరు పోస్టర్లు ఒకరినుండి ఒకరు షేర్ చేసుకుంటూ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారు? పోస్టర్లు ఎక్కడివి? అనే వివరాల్లోకి వెళితే…

క్రిస్మస్ సందర్భంగా ఓ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి.దక్షిణాఫ్రికాకు చెందిన MS బుడేలీ అనే పాస్టర్.ఏకంగా క్రైస్తువులకు ప్రభువైన ఏసు క్రీస్తుతో స్వర్గంలో డైరెక్టుగా మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించాడు.

అయితే దానికి రుసుము కూడా పెట్టాడు. దాదాపు రూ.96లక్షల విలువైన డబ్బును తనకు చెల్లిస్తే.డిసెంబర్ 25 అనగా క్రిస్మస్ సందర్భంగా ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేస్తానంటూ స్థానిక ప్రజలను నమ్మబలికాడు.

దాంతో ఈ విషయం స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలోకూడా వివాదం అవుతోంది.

Telugu Game, Heaven, Jesus Christ, God, Budeli, African, Prayers-Latest News - T

సదరు వ్యక్తి యేసు ప్రభువుతో తనకు చాలా సాన్నిహిత్యం ఉందనీ, ఏసు తన మాట వింటాడనీ, ఆయనతో సమావేశం కావాలనుకొనేవాళ్ళు ఫీజు కింద ఆ మొత్తాన్ని చెల్లిస్తే జీవితం పావనం అవుతుందని ఏకంగా పోస్టర్లు ప్రింట్ చేయించి అతగాడు వున్నచోట స్థానికంగా గోడలకు పత్రికలను అంటించాడు.దీంతో ఆ పోస్టర్ల విషయం సోషల్ మీడియాకు చేరింది.దీంతో నెటిజన్లు స్పందిస్తూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

మనిషి ఎదగనంతకాలం వారి అమయకాన్ని సొమ్ము చేసుకునే ఇలాంటి మత ప్రచారకులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే వుంటారు.కాబట్టి అలాంటి పాస్టర్ల బూటకపు మాటలు ఎవరు నమ్మవద్దని నెటిజన్లు అమాయకులైన ప్రజలకు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube