సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలు ఎంతగా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారో అంతకు మించి నెగిటివిటీ ని మూట గట్టుకుంటున్నారు.కొందరు అనవసరంగా సెలబ్రెటీలను విమర్శిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు.
మరి కొందరు సెలబ్రిటీల దృష్టి లో పడేందుకు వారి పై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు.వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా బ్యాడ్ కామెంట్స్ బారిన పడుతున్నారు.
బ్యాడ్ కామెంట్స్ ఎదుర్కొంటున్న వారు చాలా మంది ఉన్నారు.కొందరు చూసి చూడనట్టు వదిలేస్తే.
మరి కొందరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ కి బాధ పడుతున్నారు.మరి కొందరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ చేసే వారిని బయటకు లాగి మరీ పోలీసులకు అప్పగిస్తున్నారు.
ఇటీవల అనసూయ మరియు పవిత్ర లోకేష్ లు ఇద్దరు కూడా సోషల్ మీడియా లో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసుల ముందుకు వెళ్లారు.వారిద్దరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా లో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి పై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం కూడా జరిగింది.
అనసూయ మరియు పవిత్ర లోకేష్ చేసిన పనికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈ సమయం లోనే పవిత్ర లోకేష్ ఇంకా అనసూయ మాదిరిగా సినిమా పరిశ్రమ కు చెందిన ప్రతి ఒక్కరు ఉండాలని తమ పై ఏ చిన్న బ్యాడ్ కామెంట్ చేసినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి పోలీసుల వరకు వెళ్లాలని అప్పుడే టైం పాస్ కోసం బ్యాడ్ కామెంట్స్ పెట్టే వారికి బుద్ధి వస్తుందని కొందరు అభిప్రాయం పని చేస్తున్నారు.కొందరు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న కారణం గానే అందరికీ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి.అందుకే ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్స్ విషయం లో సీరియస్ గా ఉండాలంటూ కొందరు సలహా ఇస్తున్నారు.