సోషల్ మీడియా నే తమ బలం అంటున్న జనసైనికులు !

తన వారాహి యాత్ర( Varahi Yatra )తో రాష్ట్ర రాజకీయాల్లో వేగం పెంచేసిన పవన్( Pawan kalyan ) జనసేనకు రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు కదులుతున్నారు.ఏ ఒక్క సామాజిక వర్గం కోసమో తాను పనిచేయట్లేదు అని చెప్పిన పవన్, వెనుకబడిన కులాలన్నింటికీ రాజ్యాధికారందక్కాలని ఆ దిశగా వారందరూ సంఘటితంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

 Social Media Is Our Strenth Janasana , Janasana , Pawan Kalyan, Ys Jagan Mohan-TeluguStop.com

ఎంతసేపు రాజ్యాధికారంలో వాటా ఆ రెండు కులాల దేనా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించడం గమనార్హం.ఇది అధికార వైసిపి తో పాటు తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్న ఒక సామాజిక వర్గానికి కూడా కొంత ఇబ్బందికరంగా మారే ప్రశ్ననే చెప్పవచ్చు.

పవన్ ఎప్పుడైతే వెనకబడిన వర్గాలకు రాజ్యాధికారం అంటూ మాట్లాడటం మొదలుపెట్టారో ఆంధ్రప్రదేశ్లోని మెజారిటీ మీడియా ఆయన వార్తలకు ప్రచారం ఇవ్వటం మానేసింది .

Telugu Ap, Chandra Babu, Janasana, Pawan Kalyan, Ysjagan-Telugu Political News

వారాహి యాత్ర ప్రారంభంలో ఆయనకు దక్కిన మీడియా మైలేజ్ గత కొన్ని రోజులుగా, ప్రింట్ మీడియాలో చివరి పేజీలకు పరిమితమైతే, విజువల్ మీడియాలో అయితే అసలు స్థానం దక్కించుకోకపోవడం గమనార్హం.తెలుగుదేశం పార్టీ నుంచిపవన్ దూరంగా వెళుతున్న సంకేతాలు కనబడగానే టిడిపి అనుకూల మీడియా పవన్ వ్యాఖ్యలకు ప్రచారం తగ్గించడం ఒక పక్క అయితే తన పానల్ అనుకూల విశ్లేషకులతో పవన్ కి నిలకడ లేదని, పవన్ కు రాజకీయ ముందు చూపు లేదంటూ డిబేట్లకు తెరతీసింది .పవన్ నోటి నుంచి వచ్చే జగన్( YS Jagan Mohan Reddy ) వ్యతిరేక వార్తలకు మాత్రమే చోటిస్తున్న ఒక వర్గం మీడియా రాజ్యాధికారం దిశ గాను కులాల సమైక్యత దిశగాను ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జన సైనికులు వాఖ్యనిస్తున్నారు .

Telugu Ap, Chandra Babu, Janasana, Pawan Kalyan, Ysjagan-Telugu Political News

అయితే అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా తమ అధినేత వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వక పోయినప్పటికీ టెక్నాలజీకి పై బాగా అవగాహన ఉన్న జన సైనికులు ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ తమ అధినేత ప్రసంగాలను ప్రసారం చేసుకోవడం గమనార్హం .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube