సోషల్ మీడియా నే తమ బలం అంటున్న జనసైనికులు !

తన వారాహి యాత్ర( Varahi Yatra )తో రాష్ట్ర రాజకీయాల్లో వేగం పెంచేసిన పవన్( Pawan Kalyan ) జనసేనకు రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు కదులుతున్నారు.

ఏ ఒక్క సామాజిక వర్గం కోసమో తాను పనిచేయట్లేదు అని చెప్పిన పవన్, వెనుకబడిన కులాలన్నింటికీ రాజ్యాధికారందక్కాలని ఆ దిశగా వారందరూ సంఘటితంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఎంతసేపు రాజ్యాధికారంలో వాటా ఆ రెండు కులాల దేనా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించడం గమనార్హం.

ఇది అధికార వైసిపి తో పాటు తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్న ఒక సామాజిక వర్గానికి కూడా కొంత ఇబ్బందికరంగా మారే ప్రశ్ననే చెప్పవచ్చు.

పవన్ ఎప్పుడైతే వెనకబడిన వర్గాలకు రాజ్యాధికారం అంటూ మాట్లాడటం మొదలుపెట్టారో ఆంధ్రప్రదేశ్లోని మెజారిటీ మీడియా ఆయన వార్తలకు ప్రచారం ఇవ్వటం మానేసింది .

"""/" / వారాహి యాత్ర ప్రారంభంలో ఆయనకు దక్కిన మీడియా మైలేజ్ గత కొన్ని రోజులుగా, ప్రింట్ మీడియాలో చివరి పేజీలకు పరిమితమైతే, విజువల్ మీడియాలో అయితే అసలు స్థానం దక్కించుకోకపోవడం గమనార్హం.

తెలుగుదేశం పార్టీ నుంచిపవన్ దూరంగా వెళుతున్న సంకేతాలు కనబడగానే టిడిపి అనుకూల మీడియా పవన్ వ్యాఖ్యలకు ప్రచారం తగ్గించడం ఒక పక్క అయితే తన పానల్ అనుకూల విశ్లేషకులతో పవన్ కి నిలకడ లేదని, పవన్ కు రాజకీయ ముందు చూపు లేదంటూ డిబేట్లకు తెరతీసింది .

పవన్ నోటి నుంచి వచ్చే జగన్( YS Jagan Mohan Reddy ) వ్యతిరేక వార్తలకు మాత్రమే చోటిస్తున్న ఒక వర్గం మీడియా రాజ్యాధికారం దిశ గాను కులాల సమైక్యత దిశగాను ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జన సైనికులు వాఖ్యనిస్తున్నారు .

"""/" / అయితే అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా తమ అధినేత వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వక పోయినప్పటికీ టెక్నాలజీకి పై బాగా అవగాహన ఉన్న జన సైనికులు ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ తమ అధినేత ప్రసంగాలను ప్రసారం చేసుకోవడం గమనార్హం .

ఆ ఎమ్మెల్యేలపై లీగల్ వార్ కు బీఆర్ఎస్ రెడీ