శ్రీదేవి తర్వాత అలాంటి నటి కియారానే ....నటుడు కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్ననటుడు ఎస్ జె సూర్య ( SJ Suriya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎస్ జే సూర్య ప్రస్తుతం డైరెక్షన్ కి గుడ్ బాయ్ చెబుతూ పూర్తిగా నటుడిగా మారిపోయారు.

 Kiara Is Such An Actress After Sridevi , Sj Suriya, Kiara Advani, Sridevi, Game-TeluguStop.com

ప్రస్తుతం ఈయన రామ్ చరణ్( Ramcharan ) కియారా అద్వానీ( Kiara Advani ) హీరో హీరోయిన్లుగా శంకర్ ( Shankar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి గేమ్ చేంజర్ ( Game Changer ) సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఈ విధంగా పలు తెలుగు తమిళ భాష సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సూర్య తాజాగా సోషల్ మీడియా వేదికగా నటి కియారా అద్వానికి పుట్టినరోజు ( Birthday ) శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈయన కియారా ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.హ్యాపీ బర్త్ డే ప్రిన్సెస్ కియారా అద్వానీ.

శ్రీదేవి ( Sridevi ) తర్వాత నేను చూసిన అత్యంత ప్రభావంతురాలైన నటి మీరే అంటూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా ఈయన చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక కియారాను ఏకంగా శ్రీదేవితో పోల్చడం చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈమె కన్నా ఎంతో ప్రతిభావంతులైన నటీమణులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.అలాంటప్పుడు ఈమెను శ్రీదేవి గారితో పోల్చడం ఏంటి అంటూ ఈ పోస్ట్ పై వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు.మరి ఈమె శ్రీదేవి అంత ప్రతిభావంతురాలు అయితే జాన్వీ కపూర్ ఏంటి అంటూ పలువురు ఈ పోస్ట్ పై కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ఎస్ జె సూర్య చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube