కన్నడ స్టార్ హీరో శివన్న అలియాస్ శివ రాజ్ కుమార్( Siva Rajkumar ) రీసెంట్ గా వచ్చిన రజిని ( Rajinikanth )జైలర్ సినిమాలో కెమియో రోల్ చేసి మెప్పించారు.ఆయనతో పాటు మోహన్ లాల్ కూడా సర్ ప్రైజ్ చేశారు.
మోహన్ లాల్ పాత్ర కన్నా జైలర్ లో శివ రాజ్ కుమార్ పాత్ర హైలెట్ గా నిలిచింది.ఆ పాత్ర గురించి చాలా మంది ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.
అయితే అది చూసిన తెలుగు మేకర్స్ శివ రాజ్ కుమార్ ని మన సినిమాల్లో నటింపచేయాలని అనుకుంటున్నారు.ఆల్రెడీ ఆర్జీవి కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో శివ రాజ్ కుమార్ ని తీసుకున్నారు.
ప్రస్తుతం జైలర్( Jailer ) సినిమా చూసిన తెలుగు దర్శకులు శివ రాజ్ కుమార్ కోసం ప్రత్యేకమైన పాత్రలు రాస్తున్నారు.స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలకు.సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కి శివ రాజ్ కుమార్ పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు.జైలర్ సినిమాలో అతని పాత్ర హైలెట్ అవడం వల్ల తెలుగు, తమిళ భాషల్లో శివ రాజ్ కుమార్ కి మంచి మైలేజ్ వచ్చిందని చెప్పొచ్చు.
త్వరలోనే ఆయన్ను తెలుగు సినిమాలో కూడా చూడాలని ఆశిస్తున్నారు తెలుగు ఆడియన్స్.