సింగర్ వాణి జయరాం పోస్ట్ మార్టం పూర్తి... తలపై పెద్ద గాయం!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఒక సెలబ్రిటీ మరణ వార్త నుంచి బయటపడక ముందే మరొకరు మరణిస్తున్నారు.గడిచిన ఐదు నెలల కాలంలో ఇలా వరుస వివాదాలు చోటు చేసుకుంటూ లెజెండరీ నటీనటులు మరణించడంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది

 Legendary Singer Vani Jairam Post-mortem Examination Report Wound On Forehead, V-TeluguStop.com
Telugu Chennai, Vishwanath, Mortem, Vani Jairam-Movie

.ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె విశ్వనాథ్ మరణ వార్త విన్న మరుసటిరోజే ప్రముఖ సింగర్ వాణి జయరాం మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.సుమారు 19 భాషలలో 20 వేలకు పైగా పాటలను పాడి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నటువంటి ఈమె చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు.అయితే ఈమె శరీరంపై గాయాలు ఉండడంతో ఈమె మరణం ఎన్నో అనుమానాలకు కారణమవుతోంది.

అసలు ఈమెది సహజ మరణమా లేక తనపై ఎవరైనా కుట్ర చేశారా అన్న రీతిలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఈమె మరణించిన తర్వాత తన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Telugu Chennai, Vishwanath, Mortem, Vani Jairam-Movie

ఈ క్రమంలోనే పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఈమె తలపై ఒకటిన్నర ఇంచు గాయం ఉన్నట్లు గుర్తించారు.అయితే ఈ గాయం ఎలా అయ్యింది అనే విషయం గురించి ఇప్పుడే నిర్ధారణకు రాలేమని వైద్యులు వెల్లడించారు.తన పోస్టుమార్టం నివేదిక పూర్తిగా వచ్చిన తరువాతనే ఈ గాయం గురించి వివరణ ఇస్తామని వైద్యులు వెల్లడించారు.ఇక పోస్టుమార్టం పూర్తి కావడంతో నేడు మధ్యాహ్నం వాణి జయరాం అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.

ఈ క్రమంలోని ప్రముఖ గాయని చివరిసారి చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు సినీ సెలెబ్రిటీలు తరలివస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube