మాజీ బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ప్రస్తుతం సింగర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.అయితే అలాంటి సింగర్ కి ప్రస్తుతం బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రతికి మధ్య అప్పట్లో లవ్ ట్రాక్ నడిచింది అని ఇప్పటికే ఎన్నో వార్తలు చెప్పారు.
అయితే ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేముందే నాగార్జున (Nagarjuna) అడిగారు.కానీ అప్పుడు ఎవరా అని అందరూ భావించారు.
అంతేకాకుండా హౌస్ లో కూడా రతిక రాహుల్ పేరు తీయకుండా మాట్లాడింది.ఇక అదే సమయంలో రాహుల్ పాడిన పాట నీ బిగ్ బాస్ ప్లే చేయడంతో అందరికీ రాహుల్,రతిక ల మధ్య ప్రేమాయణం బయటపడింది.
ఆ తర్వాత కొద్ది రోజులకే రతికకి సంబంధించిన పిఆర్ టీం వారు కలిసున్నప్పుడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.దాంతో వీరి మధ్య రిలేషన్ హాట్ టాపిక్ అయింది.
ఇక ఈ ఫోటోలపై రాహుల్ సిప్లిగంజ్ స్పందిస్తూ ఇన్ని రోజులు రాని ఫోటోలు ఇప్పుడెందుకు వచ్చాయి.ఒకరిని వాడుకొని ఫేమస్ అవ్వడం కాదు మన టాలెంట్ తో మనం గెలవాలి అంటూ పరోక్ష పోస్టులు కూడా పెట్టారు.
దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం బయటపడింది.అయితే బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ సింగర్ దామిని (Damini) మూడో వారం ఎలిమినేట్ అయింది.ఇక ఆమె ఎలిమినేట్ అయ్యాక మరోసారి బిగ్ బాస్ అవకాశం ఇచ్చి రతిక, శుభశ్రీ, దామినిలలో ఎవరిని ఎంచుకుంటారో చెప్పండి అని ఆ హౌస్ మేట్స్ కి చెప్పి వారి సీక్రెట్ ఓట్స్ ప్రకారం తక్కువ ఓట్ల వచ్చిన రతికని హౌస్ లోకి తీసుకొని బిగ్ బాస్ ఉల్టా పాల్టా అంటూ చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా సింగర్ దామిని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.నేను హౌస్ నుండి వచ్చాక రాహుల్ నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడి ఆ తర్వాత ఇద్దరం కూడా కలిసాం.ఇక రతిక (Rathika) హౌస్లో చేసిన దానికి సంబంధించి రాహుల్ నాకు అన్ని చెప్పాడు.
అయితే రాహుల్ ఎవరితో కూడా తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోడు.అలాగే రతిక రాహుల్ మధ్య ఉన్న ప్రేమ నిజమే.కానీ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయారు.ఇక రతిక హౌస్ లో ఉన్నన్ని రోజులు రాహుల్ గురించి పేరు తీయకుండా మాట్లాడింది.
కానీ అది అందరూ ఆమె గేమ్ స్ట్రాటజీ అనుకున్నారు.కానీ అలా నేను అనుకోలేదు.ఇక బిగ్ బాస్ నుండి నేను ఎలిమినేట్ కావాల్సింది కాదు.కానీ బిగ్ బాసే కావాలని నన్ను ఎలిమినేట్ చేశారు.రతిక రోజ్ ని మళ్ళీ హౌస్ లోకి తీసుకురావడం కోసం బిగ్ బాస్ నన్ను శుభశ్రీ (Subhasri) ని వాడుకొని వదిలేసారు.తక్కువ ఓట్లు వచ్చిన రతికని హౌస్ లోకి తీసుకున్నారు అంటూ దామిని అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రస్తుతం దామిని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.