శృంగార తారలుగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన సిల్క్ స్మిత (Silk Smita) షకీలా అందరికీ తెలిసే ఉంటారు .సిల్క్ స్మిత ఎన్నో డబ్బులు సంపాదించినప్పటికీ అయిన వాళ్ళ చేతిలోనే మోసపోయి అర్దాంతరంగా సూసైడ్ చేసుకొని చనిపోయింది.
ఇక షకీలా (Shakila) కూడా తన సినిమాలతో ఎన్నో డబ్బులు సంపాదించి సొంత తల్లిదండ్రులు అలాగే సొంత సోదరి చేతిలోనే డబ్బుల విషయంలో మోసపోయింది.ఇక వీళ్లిద్దరి జీవితాలు దాదాపుగా ఒకటే విధంగా ఉంటాయి.
అయితే షకీలా ఈమధ్య కాలంలోనే బిగ్ బాస్ 7 తెలుగు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఎప్పుడైతే బిగ్ బాస్ (Bigg Boss ) హౌస్ లోకి షకీల ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి షకీలా గురించి ఎన్నో తెలియని విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
అలాంటి విషయం ఒకటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అదేంటంటే షకీలాని అందరూ చూస్తుండగానే సిల్క్ స్మిత కొట్టి అవమానించిందట.
మరి అలా ఎందుకు కొట్టింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.సిల్క్ స్మిత షకీలా ఇండస్ట్రీకి రాకముందే స్టార్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.
అయితే షకీలా ప్లే గర్ల్స్ (Play Girls) అనే సినిమాతో తమిళ సినిమా ద్వారా మొదటిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఇక ఈ సినిమాలో షకీలా తో పాటు సిల్క్ స్మిత కూడా చేసింది.
అయితే ఈ సినిమా విడుదలయ్యాక సిల్క్ స్మిత కంటే ఎక్కువగా షకీలాకే మంచి గుర్తింపు లభించింది.
ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.ఇక అప్పట్లో షకీలా (Shakila) సినిమా విడుదలవుతుందంటే చాలు చాలామంది స్టార్ హీరోలు తమ సినిమా ని రిలీజ్ చేసేవారు కాదు.ఒకవేళ రిలీజ్ అయినా కూడా తమ సినిమా హిట్ అవుతుందో లేదో అని భయపడేవారు.
అయితే అలాంటి షకీలా ని సిల్క్ స్మిత ప్లే గర్ల్స్ అనే సినిమాలో చేసే టైంలో కొట్టిందట.ఎందుకంటే సిల్క్ స్మిత మద్యానికి బానిసైన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఆ సినిమా షూటింగ్ టైంలో సిల్క్ స్మిత (Silk Smita) అప్పటికే చాలా తాగుందట.
ఇక షూటింగ్ జరిగేటప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోవడంతో షకీలా ఆమె దగ్గరికి వచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పిందట.దాంతో చిర్రెత్తుకొచ్చిన సిల్క్ స్మిత నీకే ఇది మొదటి సినిమా.ఇన్ని సినిమాలు చేసిన నన్నే అలా చేయ్ ఇలా చేయ్ అని అవమానిస్తావా.
అంటూ అందరి ముందే చెంప పై కొట్టిందట.దాంతో అవమాన భారంతో షూటింగ్ నుండి ఇంటికి వెళ్లిపోయిందట షకీలా.
కానీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడంతో సినిమా షూటింగ్ పూర్తి చేసిందట.